యాప్నగరం

నో ట్విస్ట్: రూపానీకే మళ్లీ గుజరాత్ పీఠం

గుజరాత్‌ సీఎంగా విజయ్‌ రూపాని మరోసారి బాధ్యతలు చేపట్టనున్నారు. శుక్రవారం (డిసెంబర్ 22) జరిగిన బీజేపీ శాసనసభాపక్ష సమావేశంలో ఎమ్మెల్యేలందరూ విజయ్‌ రూపానీని ఏకగ్రీవంగా తమ నేతగా ఎన్నుకున్నారు.

TNN 22 Dec 2017, 5:55 pm
గుజరాత్‌ సీఎంగా విజయ్‌ రూపాని మరోసారి బాధ్యతలు చేపట్టనున్నారు. శుక్రవారం (డిసెంబర్ 22) జరిగిన బీజేపీ శాసనసభాపక్ష సమావేశంలో ఎమ్మెల్యేలందరూ విజయ్‌ రూపానీని ఏకగ్రీవంగా తమ నేతగా ఎన్నుకున్నారు. డిప్యూటీ సీఎంగా నితిన్‌ పటేల్‌కు మరోసారి అవకాశం కల్పించారు. ఇటీవల జరిగిన గుజరాత్‌ అసెంబ్లీ ఎన్నికల్లో బీజేపీ 99 స్థానాల్లో విజయం సాధించి సంపూర్ణ మెజార్టీ సాధించిన విషయం తెలిసిందే. తాజాగా ఓ స్వతంత్ర అభ్యర్థి కూడా ఆ పార్టీకి మద్దతు తెలపడంతో ఆ సంఖ్య 100కు చేరింది. గుజరాత్‌లో బీజేపీ ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయడం వరసగా ఇది ఆరోసారి.
Samayam Telugu vijay rupani to continue as gujarat chief minister nitin patel to be his deputy
నో ట్విస్ట్: రూపానీకే మళ్లీ గుజరాత్ పీఠం


గుజరాత్‌ ఎన్నికల్లో ఘన విజయం తర్వాత.. సీఎం అభ్యర్థి ఎంపిక కోసం ఆర్థిక మంత్రి అరుణ్‌జైట్లీని పార్టీ పరిశీలకునిగా బీజేపీ అధిష్ఠానం నియమించింది. కేంద్ర మంత్రులు మన్‌సుఖ్‌ మాండవియా, స్మృతి ఇరానీ.. సీఎం రేసులో ఉన్నట్లు వార్తలు వచ్చాయి. ఈ ఊహాగానాలన్నింటికీ తెరదించుతూ రూపానీకే మరోసారి పట్టంకట్టారు.

2014 లోక్‌సభ ఎన్నికల తర్వాత మోదీ ప్రధాని పదవి చేపట్టడంతో.. గుజరాత్‌ ముఖ్యమంత్రిగా ఆనందిబెన్‌ పటేల్‌ బాధ్యతలు స్వీకరించారు. గతేడాది ఆగస్టులో ఆనందిబెన్‌ అనూహ్యంగా రాజీనామా చేయడంతో.. విజయ్‌ రూపానీకి ఈ పీఠం దక్కింది.

తరవాత కథనం

Telugu News App: ఏపీ, తెలంగాణకు సంబంధించిన లేటెస్ట్ అప్‌డేట్స్‌, జాతీయ, అంతర్జాతీయ, ఎడ్యుకేషన్, బిజినెస్, సినిమా, ఆధ్యాత్మికం, స్పోర్ట్స్, వైరల్ కథనాల కోసం తెలుగు సమయం యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి.
తాజా వార్తల అప్డేట్ల కోసం Samayam Telugu ఫేస్‌బుక్పేజీను లైక్ చెయ్యండి.