యాప్నగరం

నాగాలాండ్‌లో హింస: సైన్యం మోహరింపు

నాగాలాండ్ రాష్ట్రం నాలుగు రోజులుగా అట్టుడుకుతోంది.

TNN 3 Feb 2017, 3:55 pm
నాగాలాండ్ రాష్ట్రం నాలుగు రోజులుగా అట్టుడుకుతోంది. నాగా గిరిజనుల ఆందోళన రక్తసిక్తంగా మారడంతో చివరికి సైన్యం రంగంలోకి దిగాల్సిన పరిస్థితి ఏర్పడింది. నాగాలాండ్ రాజధాని కోహిమాలో పరిస్థితి అత్యంత ఉద్రిక్తంగా మారింది. గత నెలలో ఆ రాష్ట్ర ముఖ్యమంత్రి టీఆర్ జిలాంగ్ ఫిబ్రవరి 1న మున్సిపల్ ఎన్నికలు ఉంటాయని ప్రకటించారు. ఈ సందర్భంగా ముఖ్యమంత్రి మహిళలకు 33 శాతం రిజర్వేషన్ ఇస్తున్నట్టు ప్రకటించారు. ఆ ప్రకటనతో నాగా గిరిజనులు భగ్గుమన్నారు. మహిళలకు రిజర్వేషన్ ఇవ్వడాన్ని అంగీకరించమంటూ ఆందోళనకు దిగారు. ఆందోళన హింసాత్మకంగా మారడంతో పోలీసులు కాల్పులు జరిపారు. ఈ ఘటనలో ఇద్దరు యువకులు మరణించారు. వారి మరణంతో ఆందోళన మరింత హింసాత్మకంగా మారింది. వారి మృతదేహాలకు ఆందోళనకారులు అంత్యక్రియలు నిర్వహించలేదు. ముఖ్యమంత్రి రాజీనామా చేసే వరకు ఖననం చేయమని చెప్పారు.
Samayam Telugu violence in nagaland protesters attack government offices in kohima
నాగాలాండ్‌లో హింస: సైన్యం మోహరింపు


గురువారం రాజధాని కోహిమా లోని పలు ప్రభుత్వ ఆఫీసులకు నిప్పుపెట్టారు. ఎలక్షన్ కమిషన్, డిప్యూటీ కమిషనర్ ఆఫీస్, మున్సిపల్ బిల్డింగ్, రైల్వే రిజర్వేషన్ కౌంటర్, ప్రెస్ క్లబ్ ఇలా అనే కార్యాలయాల భవంతులపై దాడి చేశారు. దీంతో ప్రభుత్వం సైన్యం సాయం కోరింది. రంగంలోకి దిగిన ఆర్మీ కోహిమాను తమ ఆధీనంలోకి తీసుకుంది. 144 సెక్షన్ ను విధించింది. ప్రస్తుతం పరిస్థితి అదుపులోకి వచ్చింది.

తరవాత కథనం

Telugu News App: ఏపీ, తెలంగాణకు సంబంధించిన లేటెస్ట్ అప్‌డేట్స్‌, జాతీయ, అంతర్జాతీయ, ఎడ్యుకేషన్, బిజినెస్, సినిమా, ఆధ్యాత్మికం, స్పోర్ట్స్, వైరల్ కథనాల కోసం తెలుగు సమయం యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి.
తాజా వార్తల అప్డేట్ల కోసం Samayam Telugu ఫేస్‌బుక్పేజీను లైక్ చెయ్యండి.