యాప్నగరం

ఆర్జేడీ నేత ఓవరాక్షన్.. డ్యాన్సర్స్‌తో అసభ్య ప్రవర్తన

బీహార్‌లో ఓ ఆర్జేడీ నేత రెచ్చిపోయాడు. మద్యం మత్తులో ఊగిపోయాడు. డ్యాన్సర్‌తో కలిసి చిందులేశాడు. అంతటితో ఆగకుండా ఆమెతో అసభ్యంగా ప్రవర్తించాడు. ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది.

TNN 18 Mar 2018, 2:09 pm
బీహార్‌లో ఓ ఆర్జేడీ నేత రెచ్చిపోయాడు. మద్యం మత్తులో ఊగిపోయాడు. డ్యాన్సర్‌తో కలిసి చిందులేశాడు. అంతటితో ఆగకుండా ఆమెతో అసభ్యంగా ప్రవర్తించాడు. ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. ఫతేపూర్‌లో ఓ వివాహ వేడుక జరిగింది. అక్కడ డ్యాన్స్ కార్యక్రమం ఏర్పాటు చేశారు. అక్కడికి వచ్చిన ఆర్జేడీ నేత అరుణ్ దాద్‌పూరి స్టేజ్‌పైకి ఎక్కాడు. ఆమెతో కలిసి డ్యాన్స్ వేస్తూ... జేబులో నుంచి డబ్బు తీశాడు. నోట్లను డ్యాన్సర్‌పైకి వెదజల్లుతూ... అక్కడ కాసేపు హంగామా చేశాడు.
Samayam Telugu viral video rjd leader dancing misbehaving with female dancer
ఆర్జేడీ నేత ఓవరాక్షన్.. డ్యాన్సర్స్‌తో అసభ్య ప్రవర్తన


డబ్బు చల్లడంతోనే ఆగలేదు. ఆమెకు ఇష్టం లేకపోయినా... పైకి ఎత్తుకొని డ్యాన్స్ చేసే ప్రయత్నం చేశాడు. అక్కడ ఉన్నవాళ్లంతా అభ్యంతరం వ్యక్తం చేసి... ఆందోళన చేయడంతో అప్పుడు డ్యాన్సర్‌ను కిందకు దించి అక్కడి నుంచి మెల్లిగా జారకున్నాడు. ఈ సీన్ మొత్తాన్ని అక్కడున్న వాళ్లలో ఎవరో రికార్డ్ చేసి సోషల్ మీడియాలో పోస్ట్ చేశారు. ఇప్పుడీ వీడియో ఆర్జేడీ అధిష్టానానికి చేరింది. ఈ ఘటనను సీరియస్‌గా తీసుకున్న నేతలు... అతడిపై చర్యలు తీసుకుంటామని చెబుతున్నారు.

తరవాత కథనం

Telugu News App: ఏపీ, తెలంగాణకు సంబంధించిన లేటెస్ట్ అప్‌డేట్స్‌, జాతీయ, అంతర్జాతీయ, ఎడ్యుకేషన్, బిజినెస్, సినిమా, ఆధ్యాత్మికం, స్పోర్ట్స్, వైరల్ కథనాల కోసం తెలుగు సమయం యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి.
తాజా వార్తల అప్డేట్ల కోసం Samayam Telugu ఫేస్‌బుక్పేజీను లైక్ చెయ్యండి.