యాప్నగరం

వాలెంటైన్స్ డే ఆఫర్: రూ.899కే విమాన ప్రయాణం!

‘వాలెంటైన్స్ డే’ పురస్కరించుకుని విస్తారా ఎయిర్ లైన్స్ బంపర్ ఆఫర్ ప్రకటించింది. కేవలం రూ.899కే విమాన ప్రయాణం చేసేందుకు అవకాశం కల్పించనుంది. అయితే, ఈ ఆఫర్ ఐదు రోజులు మాత్రమే ఉంటుంది.

TNN 13 Feb 2017, 7:29 pm
‘వాలెంటైన్స్ డే’ పురస్కరించుకుని విస్తారా ఎయిర్ లైన్స్ బంపర్ ఆఫర్ ప్రకటించింది. కేవలం రూ.899కే విమాన ప్రయాణం చేసేందుకు అవకాశం కల్పించనుంది. అయితే, ఈ ఆఫర్ ఐదు రోజులు మాత్రమే ఉంటుంది. ఫిబ్రవరి 28 నుంచి సెప్టెంబరు 20 లోపు తీసుకునే టికెట్లకు ఈ ఆఫర్ వర్తిస్తుంది. గౌహతి నుంచి బాగ్‌డోగరాకుఅన్ని రకాల ట్యాక్సులు కలిపి ప్రారంభ ధర కింద రూ.899కే టికెట్ లభిస్తుంది. ఇది ఒక వైపు ప్రయాణానికి మాత్రమే. అలాగే, ఇతర ప్రాంతాలకు కూడా తక్కువ ధరల్లోనే విమాన ప్రయాణ సదుపాయం కల్పిస్తోంది.
Samayam Telugu vistara announces 5 day valentines day sale
వాలెంటైన్స్ డే ఆఫర్: రూ.899కే విమాన ప్రయాణం!


గోవా - ముంబయికి రూ.1,449, దిల్లీ - అమ్రుత్‌సర్‌కు రూ.1,549, దిల్లీ అహ్మదాబాద్‌కు రూ.1,899, దిల్లీ - పుణెకు రూ.2,399, దిల్లీ -కోల్‌కతాకు రూ.2,699, దిల్లీ - గోవాకు రూ.3,299, దిల్లీ - లేహ్‌కు రూ.4,999, దిల్లీ - పోర్ట్‌బ్లెయర్‌కు రూ.5,999 చొప్పున రాయితీలు కల్పించింది. సోమవారం నుంచి ఫిబ్రవరి 17 వరకు మాత్రమే ఈ ఆఫర్ అందుబాటులో ఉంటుంది.

తరవాత కథనం

Telugu News App: ఏపీ, తెలంగాణకు సంబంధించిన లేటెస్ట్ అప్‌డేట్స్‌, జాతీయ, అంతర్జాతీయ, ఎడ్యుకేషన్, బిజినెస్, సినిమా, ఆధ్యాత్మికం, స్పోర్ట్స్, వైరల్ కథనాల కోసం తెలుగు సమయం యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి.
తాజా వార్తల అప్డేట్ల కోసం Samayam Telugu ఫేస్‌బుక్పేజీను లైక్ చెయ్యండి.