యాప్నగరం

అమ్మ మృతికి నువ్వే కారణమంటూ శశికళకు లేఖలు!

అన్నాడీఎంకే నేత జయలలిత అక్రమాస్తుల కేసులో ప్రధాన నిందితురాలిగా శిక్ష అనుభవిస్తున్న ఏఐడీఎంకే తాత్కాలిక ప్రధాన కార్యదర్శి వీకే శశికళను బెదిరిస్తూ తమిళనాడు నుంచి లేఖలు రాస్తున్నారు.

TNN 23 Mar 2017, 12:18 pm
అన్నాడీఎంకే నేత జయలలిత అక్రమాస్తుల కేసులో ప్రధాన నిందితురాలిగా శిక్ష అనుభవిస్తున్న ఏఐడీఎంకే తాత్కాలిక ప్రధాన కార్యదర్శి వీకే శశికళను బెదిరిస్తూ తమిళనాడు నుంచి లేఖలు రాస్తున్నారు. బెంగళూరులోని పరప్పన అగ్రహారం కేంద్ర కారాగారంలో ఉన్న ఆమెకు జయలలితను చంపిన నిన్ను వదిలేది లేదంటూ తమిళనాడు నుంచి లేఖలు వచ్చినట్లు అధికారులు తెలిపారు.
Samayam Telugu vk sasikala flooded with hate mails in jail
అమ్మ మృతికి నువ్వే కారణమంటూ శశికళకు లేఖలు!


శశికళ, సెంట్రల్ ప్రిజన్, పరప్పన అగ్రహారం, బెంగళూరు చిరునామాకు ఫిబ్రవరి 15 నుంచి ఇప్పటి వరకు 100 లేఖలు అందాయి. అమ్మ మృతికి ప్రధాన కారకురాలివే నువ్వే... పథకం ప్రకారం ఆమెను హత్య చేశావు..దీనికి మరో కారణం లేదంటూ అందులో పేర్కొన్నారు. మా పురట్చితలైవి, మా అమ్మ వెనుకుండే ఆమె ప్రాణాలు తీసిన ద్రోహివి...నీకు గొప్ప జీవితానిచ్చి, ఇంతటి దానిని చేసిన వ్యక్తిని మోసగించావు... గుర్తించుకో నీవు చేసిన పాపాలకు శిక్ష తప్పక అనుభవిస్తావని లేఖల్లో రాసినట్లు జైలు వర్గాలు తెలియజేశాయి.

చాలా లేఖలు రాజకీయ కోణంలోనే ఉన్నాయి తప్ప, అందులో ఎలాంటి బెదిరింపులు లేవని అధికారులు అంటున్నారు. శశికళకు వచ్చిన ఉత్తరాలను ఆమె మేనకోడలు ఇళవరసి క్రోడీకరించి, చాలా వాటిని చించిపడేస్తున్నారని అన్నారు. మొదట్లో వచ్చిన లేఖలను శశికళ చదివినా, తర్వాత మాత్రం వాటిని పట్టించుకోలేదని జైలు సిబ్బంది తెలిపారు. ఇవి ముఖ్యంగా తమిళనాడులోని సేలం, ధర్మపురి, మదురై, దిండిగళ్, కరూర్, తిరుచరాపల్లి, విల్లుపురం ప్రాంతాల నుంచి వచ్చినట్లు వారు తెలియజేశారు. అతి కొద్ది మొత్తంలోనే చెన్నై నుంచి వచ్చాయని తెలిపారు.

తరవాత కథనం

Telugu News App: ఏపీ, తెలంగాణకు సంబంధించిన లేటెస్ట్ అప్‌డేట్స్‌, జాతీయ, అంతర్జాతీయ, ఎడ్యుకేషన్, బిజినెస్, సినిమా, ఆధ్యాత్మికం, స్పోర్ట్స్, వైరల్ కథనాల కోసం తెలుగు సమయం యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి.
తాజా వార్తల అప్డేట్ల కోసం Samayam Telugu ఫేస్‌బుక్పేజీను లైక్ చెయ్యండి.