యాప్నగరం

రాజస్థాన్ సంక్షోభం: కాంగ్రెస్‌కు మాయవతి షాక్.. బీఎస్పీ ఎమ్యెల్యేలకు విప్ జారీ

ఊహించని మలుపుతో సస్పెన్షన్ థ్రిల్లర్‌ను తలపిస్తోన్న రాజస్థాన్ రాజకీయాల్లో మరో కీలక పరిణామం చోటుచేసుకుంది. అసమ్మతి నేత సచిన్ పైలట్‌ తిరుగుబాటుతో గెహ్లాట్ ప్రభుత్వం మైనార్టీలో పడింది.

Samayam Telugu 27 Jul 2020, 11:48 am
రాజస్థాన్ రాజకీయ సంక్షోభం సోమవారం మరో మలుపు తిరిగింది. అశోక్ గెహ్లాట్ ప్రభుత్వానికి మద్దతు ఇస్తున్న ఆరుగురు బీఎస్పీ ఎమ్మెల్యేలు కాంగ్రెస్ పార్టీలో చేరిపోయారు. అయితే, తమ పార్టీకి చెందిన ఎమ్మెల్యేలకు బీఎస్పీ విప్ జారీచేసింది. అసెంబ్లీలో బలపరీక్ష నిర్వహిస్తే అశోక్ గెహ్లాట్‌కు వ్యతిరేకంగా ఓటు వేయాలని స్పష్టం చేసింది. బీఎస్పీ ఎమ్మెల్యేలు కాంగ్రెస్‌లో చేరిపోవడంతో ఆ పార్టీకి అసెంబ్లీలో ప్రాతినిధ్యం లేకుండా పోయింది. కానీ, వారంతా ఎన్నికల్లో బీఎస్పీ తరఫున గెలుపొందడంతో ప్రస్తుతం పార్టీ విప్ జారీ చేయడం సాంకేతిక సమస్యలకు దారితీస్తుంది.
Samayam Telugu బీఎస్పీ ఎమ్మెల్యేలకు విప్
Rajasthan Political Crisis


కాగా, ఈ అంశంపై రాజ్యసభ ఎన్నికల సమయంలోనే ఎలక్షన్ కమిషన్‌కు బీఎస్పీ అధినేత్రి ఫిర్యాదు చేశారు. కాంగ్రెస్‌లో చేరిన ఆరుగుర్నీ తమ పార్టీ ఎమ్మెల్యేలుగా పరిగణించాలని మాయావతి కోరగా.. స్పీకర్ అధికారాల్లో తాము జోక్యం చేసుకోలేమని ఈసీ తిరస్కరించింది. రాజస్థాన్‌లో రాజకీయ సంక్షోభం ఏర్పడటంతో మరోసారి వీరికి బీఎస్పీ విప్ జారీచేసింది.

‘ఆరుగురు ఎమ్మెల్యేలకు వేర్వేరుగా, సమిష్టిగా నోటీసులు జారీ చేశాం.. బీఎస్పీ ఒక జాతీయ పార్టీ కాబట్టి, జాతీయస్థాయిలో విలీనం అయితే తప్ప తమ సభ్యులు రాష్ట్ర స్థాయిలో విలీనం కుదురదని, వారు దీనిని ఉల్లంఘిస్తే అనర్హులు అవుతారు’అని ఆ పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి సతీశ్ చంద్ర మిశ్రా వ్యాఖ్యానించారు.

మరోవైపు, శాసనసభను జులై 31న సమావేశపరచాలని కోరుతూ గవర్నర్ కల్‌‌రాజ్ మిశ్రాకు సీఎం గెహ్లాట్ ప్రతిపాదనలు పంపారు. కరోనా వైరస్ పరిస్థితులపై చర్చించడానికి సభను సమావేశపరచాలని కోరారు. ఇంతకు ముందు గెహ్లాట్ పంపిన ప్రతిపాదనలపై ఎలాంటి కారణాలు, తేదీ పేర్కొనలేదని గవర్నర్ తిరస్కరించిన విషయం తెలిసిందే.

తరవాత కథనం

Telugu News App: ఏపీ, తెలంగాణకు సంబంధించిన లేటెస్ట్ అప్‌డేట్స్‌, జాతీయ, అంతర్జాతీయ, ఎడ్యుకేషన్, బిజినెస్, సినిమా, ఆధ్యాత్మికం, స్పోర్ట్స్, వైరల్ కథనాల కోసం తెలుగు సమయం యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి.
తాజా వార్తల అప్డేట్ల కోసం Samayam Telugu ఫేస్‌బుక్పేజీను లైక్ చెయ్యండి.