యాప్నగరం

అగస్టా కుంభకోణం: త్యాగికి 4రోజుల సీబీఐ కస్టడీ

అగస్టా వెస్ట్‌ల్యాండ్ హెలికాప్టర్ల కుంభకోణంలో నిందితులుగా భావిస్తున్న వైమానిక దళం మాజీ చీఫ్ శశీంద్ర పాల్ త్యాగితో మరో ఇద్దరిని సీబీఐ నాలుగు రోజులు కస్టడీలోకి తీసుకుంది.

TNN 10 Dec 2016, 6:21 pm
అగస్టా వెస్ట్‌ల్యాండ్ హెలికాప్టర్ల కుంభకోణంలో నిందితులుగా భావిస్తున్న వైమానిక దళం మాజీ చీఫ్ శశీంద్ర పాల్ త్యాగితో మరో ఇద్దరిని సీబీఐ నాలుగు రోజులు కస్టడీలోకి తీసుకుంది. ఎస్పీ త్యాగితో పాటు అతని సోదరుడు సంజీవ్ త్యాగి, న్యాయవాది గౌతమ్ ఖైతాన్‌ను శుక్రవారం అరెస్టు చేసిన సీబీఐ శనివారం పటియాలా హౌస్ కోర్టులో హాజరుపరిచింది. సీబీఐ 10 రోజుల కస్టడీ కోరగా నాలుగు రోజుల కస్టడీకి కోర్టు అనుమతించింది.
Samayam Telugu vvip chopper scam cbi gets 4 day custody of former air force chief sp tyagi
అగస్టా కుంభకోణం: త్యాగికి 4రోజుల సీబీఐ కస్టడీ


వీవీఐపీల కోసం అగస్టా వెస్ట్‌ల్యాండ్‌ మాతృసంస్థ ఫిన్‌మెకానికాతో చేసుకున్న 12 హెలీకాప్టర్ల కొనుగోలు ఒప్పందంలో అవినీతి జరిగినట్లు ఆరోపణలున్నాయి. ఫిన్‌మెకానికాతో కుదిరిన రూ. 3,546 కోట్ల ఒప్పందంలో రూ. 450 కోట్ల కుంభకోణం జరిగినట్లు సీబీఐ కేసు నమోదు చేసింది. ఈ కేసులో ఐఏఎఫ్ మాజీ చీఫ్ ఎస్పీ త్యాగి, సంజీవ్ త్యాగి, గౌతమ్ ఖైతాన్‌తో పాటు 19 మందిపై సీబీఐ కేసులు పెట్టింది.

తరవాత కథనం

Telugu News App: ఏపీ, తెలంగాణకు సంబంధించిన లేటెస్ట్ అప్‌డేట్స్‌, జాతీయ, అంతర్జాతీయ, ఎడ్యుకేషన్, బిజినెస్, సినిమా, ఆధ్యాత్మికం, స్పోర్ట్స్, వైరల్ కథనాల కోసం తెలుగు సమయం యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి.
తాజా వార్తల అప్డేట్ల కోసం Samayam Telugu ఫేస్‌బుక్పేజీను లైక్ చెయ్యండి.