యాప్నగరం

'మిస్టర్ యూనివర్శ్' రన్నరప్‌గా వాటర్ ట్యాంకర్ డ్రైవర్

ఎన్నో ఆర్థిక ఇబ్బందుల మధ్య ఓ సాధారణ డ్రైవర్‌గా ఉద్యోగం చేసుకుంటూనే బాలకృష్ణ సాధించిన ఈ విజయం ఎంతోమందికి..

TNN & Agencies 2 Dec 2016, 9:01 am
మిస్టర్ యూనివర్శ్ రన్నరప్‌గా కర్ణాటకకు చెందిన ఓ వాటర్ ట్యాంకర్ డ్రైవర్ నిలవడం ప్రాధాన్యతను సంతరించుకుంది. ఇప్పటికే మిస్టర్ ఆసియా టైటిల్ గెలుచుకున్న బాలకృష్ణ.. ఇటీవలే జెర్మనీలోని హాంబర్గ్‌లో జరిగిన మిస్టర్ యూనివర్శ్ బాడీ బిల్డింగ్ ఈవెంట్‌లో రన్నరప్‌గా నిలిచారు. ఎన్నో ఆర్థిక ఇబ్బందుల మధ్య ఓ సాధారణ డ్రైవర్‌గా ఉద్యోగం చేసుకుంటూనే బాలకృష్ణ సాధించిన ఈ విజయం ఎంతోమందికి ఆదర్శం అనిపించుకుంది.
Samayam Telugu water tanker driver from bengaluru is the runner up of mr universe
'మిస్టర్ యూనివర్శ్' రన్నరప్‌గా వాటర్ ట్యాంకర్ డ్రైవర్


ఆర్థిక కష్టాల మధ్య ఉద్యోగం చేసుకుంటూనే రోజూ 6 గంటలపాటు వర్కౌట్స్ చేయడం అతడి దినచర్యలో ఓ భాగం. అన్నింటికిమించి బాలకృష్ణ డైలీ డైట్ చాలా ఖరీదైంది కావడం అతడికి మరింత ఇబ్బంది పెట్టే అంశం. రోజూ 750 గ్రాముల చికెన్, 25 గుడ్లు, 300గ్రాముల రైస్, 200 గ్రాముల కూరగాయలు, చేపలు, పండ్లు అతడికి అవసరమయ్యే పోషకాహారాలు.

బాడీ బిల్డింగ్‌లో నెంబర్ 1 కావాలంటే ఇవన్నీ తప్పనిసరిగా పాటించాల్సిందే. లేదంటే పోటీల్లో వెనుకబడిపోవడం ఖాయం. కానీ ఓవైపు పేదరికం.. మరోవైపు ఉద్యోగం చేసుకుంటే కానీ రోజు గడవని పరిస్థితి. ప్రస్తుతానికి కొంతోగొప్పో స్పాన్సర్ల సహాయం అందుతుండటం వల్లే అతడికి అంతర్జాతీయ పోటీల్లో పాల్గొనే అవకాశం లభించినప్పటికీ... ప్రభుత్వం నుంచి అందాల్సిన సహాయం అందడం లేదనే అభిప్రాయం మాత్రం వ్యక్తమవుతోంది. అదే ఒకవేళ ప్రభుత్వం తగిన విధంగా తోడ్పాటుని అందించి ఉంటే ఇవాళ అతడు కచ్చితంగా మిస్టర్ యూనివర్శ్ పోటీల్లో టైటిల్ విన్నర్ అయ్యుండేవాడు అంటున్నారు బాలకృష్ణ పట్టుదల గురించి తెలిసిన వారు.

తరవాత కథనం

Telugu News App: ఏపీ, తెలంగాణకు సంబంధించిన లేటెస్ట్ అప్‌డేట్స్‌, జాతీయ, అంతర్జాతీయ, ఎడ్యుకేషన్, బిజినెస్, సినిమా, ఆధ్యాత్మికం, స్పోర్ట్స్, వైరల్ కథనాల కోసం తెలుగు సమయం యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి.
తాజా వార్తల అప్డేట్ల కోసం Samayam Telugu ఫేస్‌బుక్పేజీను లైక్ చెయ్యండి.