యాప్నగరం

మనది నిస్వార్ధ భారతం: ప్రధాని మోదీ

మనది నిస్వార్ధ భారతం అని భవిష్యత్ తరాల కోసం అవినీతి రహిత సమాజాన్ని నిర్మించడమే ధ్యేయంగా

Samayam Telugu 10 Dec 2016, 12:52 pm
మనది నిస్వార్ధ భారతం అని భవిష్యత్ తరాల కోసం అవినీతి రహిత సమాజాన్ని నిర్మించడమే ధ్యేయంగా సాగుతున్నామని ప్రధానమంత్రి నరేంద్రమోదీ స్పష్టం చేశారు. శనివారం గుజరాత్ లోని బనస్కాంత జిల్లాలోని దీసలో పలు అభివృద్ధి పథకాలకు శంకుస్థాపన చేశారు. దేశీయ పాల కేంద్రాన్ని ప్రారంభి...అమూల్ పాల ప్యాకేట్ల బ్రాండ్ ను ప్రారంభించారు.
Samayam Telugu we are not a selfish nation pm modi
మనది నిస్వార్ధ భారతం: ప్రధాని మోదీ


ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన బహిరంగ సభలో మోదీ మాట్లాడారు. ఎన్డీయే ప్రభుత్వం మాటల ప్రభుత్వం కాదని చేతల ప్రభుత్వమని మోదీ అన్నారు. ఎన్నికల్లో ఎన్నో విమర్శలు చేసుకున్నామని, కానీ ప్రజలకు టెక్నాలజీ, బ్యాంకింగ్ ఎలా వినియోగించుకోవాలని బోధించాలని ఆయన ప్రతిపక్షాలకు సూచించారు.

అవినీతితో పేదలు, సామాన్యులు సంతోషంగా లేరని గుర్తు చేసిన మోదీ..నోట్లరద్దుతో నల్లధనం, తీవ్రవాదం, నకిలీ నోట్ల తయారీకి చెక్ పెట్టామని చెప్పారు. దేశం బలోపేతం కావడానికే పెద్దనోట్లను రద్దు చేశామని మోదీ పునరుద్ఘాటించారు.

రైతులు, కార్మికులు, పేదల సాధికారతకు కేంద్రప్రభుత్వం అవసరమైన చర్యలు తీసుకుంటుందని ఆయన తెలిపారు.

ఈ కార్యక్రమంలో అమూల్ దేశీ పాల ప్యాకేట్ ధర రూ.35 500గ్రాముల ప్యాకేట్ల అమ్మకాలను ఆయన ప్రారంభించారు.

తరవాత కథనం

Telugu News App: ఏపీ, తెలంగాణకు సంబంధించిన లేటెస్ట్ అప్‌డేట్స్‌, జాతీయ, అంతర్జాతీయ, ఎడ్యుకేషన్, బిజినెస్, సినిమా, ఆధ్యాత్మికం, స్పోర్ట్స్, వైరల్ కథనాల కోసం తెలుగు సమయం యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి.
తాజా వార్తల అప్డేట్ల కోసం Samayam Telugu ఫేస్‌బుక్పేజీను లైక్ చెయ్యండి.