యాప్నగరం

అత్యాచారం కేసులు పాతవి కనుక శిక్ష తగ్గించమన్న డేరా బాబా

ఇద్దరు సాధ్వీలపై అత్యాచారం చేసిన కేసులో సీబీఐ స్పెషల్ కోర్టు విధించిన 20 ఏళ్ల జైలు శిక్ష తీర్పుపై తాము హై కోర్టుకి వెళ్తామని...

TNN 28 Aug 2017, 9:20 pm
ఇద్దరు సాధ్వీలపై అత్యాచారం చేసిన కేసులో సీబీఐ స్పెషల్ కోర్టు విధించిన 20 ఏళ్ల జైలు శిక్ష తీర్పుపై తాము హై కోర్టుకి వెళ్తామని స్పష్టంచేశారు డేరా బాబా తరపు న్యాయవాది ఎస్కే గర్గ్. అత్యాచారం కేసులు రెండూ 18 ఏళ్ల క్రితం జరిగిన పాత నేరాలే అయినందున, అందులోనూ ఆ సమయంలో మరే ఇతర కేసులు తన క్లయింట్ గుర్మీత్‌పై లేనందున కోర్టు సానుకూలంగా స్పందించి శిక్షా కాలాన్ని తగ్గించాల్సిందిగా కోర్టుని వేడుకున్నట్టు గర్గ్ మీడియాకు తెలిపారు.
Samayam Telugu we will move high court against verdict dera chiefs lawyer
అత్యాచారం కేసులు పాతవి కనుక శిక్ష తగ్గించమన్న డేరా బాబా


తీర్పు వెలువడిన అనంతరం మీడియాతో మాట్లాడిన గర్గ్... తన క్లయింట్ గుర్మీత్ రామ్ రహీం సింగ్ అనేక సేవా కార్యక్రమాలు చేస్తున్నారని, ఆయన ఎక్కువ కాలంపాటు జైల్లో వుండటం వల్ల ఆ సేవా కార్యక్రమాలన్నీ నిలిచిపోయే ప్రమాదం వుందని కోర్టుకి విన్నవించినట్టు చెప్పారు.

తరవాత కథనం

Telugu News App: ఏపీ, తెలంగాణకు సంబంధించిన లేటెస్ట్ అప్‌డేట్స్‌, జాతీయ, అంతర్జాతీయ, ఎడ్యుకేషన్, బిజినెస్, సినిమా, ఆధ్యాత్మికం, స్పోర్ట్స్, వైరల్ కథనాల కోసం తెలుగు సమయం యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి.
తాజా వార్తల అప్డేట్ల కోసం Samayam Telugu ఫేస్‌బుక్పేజీను లైక్ చెయ్యండి.