యాప్నగరం

ప్రభుత్వం ఎలా నడవాలో చూపిస్తా: యోగి

ప్రభుత్వం అంటే ఏంటో...అది ఎలా నడవాలో చూపిస్తానని ఉత్తర్ ప్రదేశ్ సీఎం యోగి ఆదిత్యనాథ్ అన్నారు.

TNN 25 Mar 2017, 8:17 pm
ప్రభుత్వం అంటే ఏంటో...అది ఎలా నడవాలో చూపిస్తానని ఉత్తర్ ప్రదేశ్ సీఎం యోగి ఆదిత్యనాథ్ అన్నారు. సామాన్య ప్రజలకు చేరువగా తమ ప్రభుత్వం నడుస్తుందని, అన్ని వర్గాలను సమానంగా చూస్తామే తప్ప ఏ ఒక్క వర్గానికి ప్రత్యేక ‘సదుపాయాలు’ ఉండబోవని ఆయన స్పష్టం చేశారు.
Samayam Telugu we will show up how a government should be run yogi
ప్రభుత్వం ఎలా నడవాలో చూపిస్తా: యోగి


యూపీ సీఎంగా ప్రమాణస్వీకారం చేశాక యోగి తొలిసారి తన సొంత నియోజకవర్గం గోరఖ్ పూర్ లో ఏర్పాటు చేసిన బహిరంగ సభలో మాట్లాడారు.

‘‘మోదీ గారి మంత్ర ‘సబ్కా సాత్, సబ్కా వికాస్’ను సూత్రాన్ని అనుసరిస్తాం. ప్రభుత్వం ఎలా నడవాలో చూపిస్తాం. సామాన్యుడి కోసం ప్రభుత్వం ఎలా పనిచేస్తుందో చూపిస్తాం’’ అని యోగి అన్నారు.

మహిళపై లైంగిక వేధింపులకు పాల్పడే వారి భరతం పట్టేందుకు ‘యాంటీ రోమియో’ స్క్వాడ్స్ రెడీ ఉంటారని.. ఆడ, మగవారు కలిసుంటే హింసించే వారితో ఊచలు లెక్క పెట్టిస్తామని చెప్పారు.

రాష్ట్రంలో శాంతిభద్రతల పరిరక్షణకు ప్రభుత్వం కట్టుబడి ఉందని.. ఎన్నికల మెనిఫెస్టో నూటికి నూరుశాతం అమలు చేస్తామని స్పష్టం చేశారు.

ఉత్తర్ ప్రదేశ్ అన్ని రంగాల్లో నిరాధరణకు గురైంది. ఇకపై నిర్లక్ష్యానికి గురయ్యే ప్రసక్తే లేదని యెగి అన్నారు.

తరవాత కథనం

Telugu News App: ఏపీ, తెలంగాణకు సంబంధించిన లేటెస్ట్ అప్‌డేట్స్‌, జాతీయ, అంతర్జాతీయ, ఎడ్యుకేషన్, బిజినెస్, సినిమా, ఆధ్యాత్మికం, స్పోర్ట్స్, వైరల్ కథనాల కోసం తెలుగు సమయం యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి.
తాజా వార్తల అప్డేట్ల కోసం Samayam Telugu ఫేస్‌బుక్పేజీను లైక్ చెయ్యండి.