యాప్నగరం

పండంటి కాపురంలో పొలిటికల్ చిచ్చు.. పార్టీ మారిన భార్య.. ఎంపీ షాకింగ్ నిర్ణయం!

భార్యాభర్తలు రాజకీయాల్లో ఉండటం ఎంత సాధారణమో.. ఇద్దరూ చేరో పార్టీలో కొనసాగడం కూడా అంతే కామన్‌గా మారింది. కానీ పార్టీ మారిన భార్యకు విడాకులు ఇస్తానని ప్రకటించాడో ఎంపీగారు.

Samayam Telugu 21 Dec 2020, 3:43 pm
భార్య ఓ పార్టీలో ఉండటం.. భర్త మరో పార్టీలో ఉండటం ప్రస్తుత రోజుల్లో చాలా కామన్. అలా ఇద్దరూ చెరో పార్టీలో ఉంటే.. ఏ పార్టీ అధికారంలో ఉన్న ఆ ఫ్యామిలీ ‘పవర్’ తగ్గదు. నిర్మలా సీతారామన్ బీజేపీలో ఉండగా.. ఆమె భర్త పరకాల ప్రభాకర్ గతంలో పీఆర్పీలో పని చేశారు. పురంధేశ్వరి బీజేపీలోకి వెళ్తే.. ఆమె భర్త దగ్గుబాటి వెంకటేశ్వరరావు వైసీపీలో పని చేశారు. ఇలా భార్యభర్తలు వేర్వేరు పార్టీల్లో ఉండటానికి ఇష్టాఇష్టాలు కూడా ఓ కారణమే. కాగా భార్య పార్టీ మారిందనే కోపంతో విడాకులు ఇవ్వాలని నిర్ణయించుకున్నారో ఎంపీ గారు.
Samayam Telugu Sujata
Sujata Mondal Khan. Facebook


ఇప్పుడు బెంగాల్‌లో రాజకీయం అధికార తృణమూల్, బీజేపీ మధ్య నువ్వా నేనా అన్నట్టుగా ఉన్న సంగతి తెలిసిందే. హ్యాట్రిక్ కొట్టాలని మమతా బెనర్జీ ప్రయత్నిస్తుండగా.. బెంగాల్‌లో పాగా వేయాలని కమలనాథులు పట్టుదలతో ఉన్నారు. ఈ క్రమంలోనే టీఎంసీ నేతలకు బీజేపీ గాలమేస్తుండగా.. కమలం పార్టీ నేతలను టీఎంసీ ఆకర్షిస్తోంది. ఈ క్రమంలోనే బీజేపీ ఎంపీ సౌమిత్రా ఖాన్ భార్య సుజాత మొండల్ ఖాన్ టీఎంసీలో చేరారు. సుజాత తృణమూల్‌లో చేరిన రెండు గంటలకే విడాకులు ఇవ్వబోతున్నానని ఆమె భర్త, బిష్ణుపూర్ ఎంపీ సౌమిత్ర ఖాన్ సంచలన ప్రకటన చేశారు. టీఎంసీ కుటుంబాలను విడగొడుతోందని ఆరోపించారు.

విడాకుల నోటీసు పంపాలని నిర్ణయించడంతోపాటు.. సుజాత ఖాన్‌కు ఇచ్చిన కారు, ఆమె ఉంటున్న ఇల్లు, సెక్యూరిటీని వెనక్కి తీసుకున్నారు. కాగా సుజాతా ఖాన్ మాట్లాడుతూ... బీజేపీ అవకాశవాద రాజకీయాలకు పాల్పడుతోందని విమర్శించారు. బీజేపీ తనను గౌరవించలేదన్నారు. కళంక నేతలను శుభ్రం చేయడానికి ఆ పార్టీ ఏ సబ్సు వాడుతుందో తనకు అర్థం కావడం లేదని చురకలు అంటించారు.

బీజేపీలో ఆరుగురు సీఎం క్యాండిడేట్లు, 13 మంది డిప్యూటీ సీఎం ముఖాలు ఉన్నాయని.. ప్రధాని మోదీ సీఎం అభ్యర్థి కాదని.. ఆ పార్టీకి నాయకత్వ సమస్య ఉందని సుజాత వ్యాఖ్యానించారు.

తరవాత కథనం

Telugu News App: ఏపీ, తెలంగాణకు సంబంధించిన లేటెస్ట్ అప్‌డేట్స్‌, జాతీయ, అంతర్జాతీయ, ఎడ్యుకేషన్, బిజినెస్, సినిమా, ఆధ్యాత్మికం, స్పోర్ట్స్, వైరల్ కథనాల కోసం తెలుగు సమయం యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి.
తాజా వార్తల అప్డేట్ల కోసం Samayam Telugu ఫేస్‌బుక్పేజీను లైక్ చెయ్యండి.