యాప్నగరం

గవర్నర్‌కి షాకిచ్చిన మమతా.. అక్కడికి వెళ్లేందుకు నో.!

పశ్చిమ బెంగాల్ గవర్నర్‌కు సీఎం మమతా బెనర్జీ షాకిచ్చారు. ఎన్నికల అనంతరం హింసాత్మక ఘటనలు జరిగిన ప్రాంతాల సందర్శిస్తానని గవర్నర్ చెప్పినా ప్రభుత్వం స్పందించకపోవడం హాట్‌టాపిక్‌గా మారింది.

Samayam Telugu 13 May 2021, 10:43 pm
పశ్చిమ బెంగాల్‌లో అసెంబ్లీ ఎన్నికలు పూర్తయినా రాజకీయ వాతావరణం హీట్ రాజేస్తోంది. బెంగాల్ గవర్నర్ జగదీప్ ధన్‌కర్, టీఎంసీ అధినేత్రి, సీఎం మమతా బెనర్జీ మధ్య ఆధిపత్య పోరు కొనసాగుతోంది. ఎన్నికల అనంతరం కూచ్ బెహర్ నియోజకవర్గంలో జరిగిన హింసాత్మక ఘటనలు మరోమారు వివాదం రాజేస్తున్నాయి. ఎన్నికల అనంతరం జరిగిన హింసాత్మక ఘటనలు జరిగిన ప్రదేశాలను గవర్నర్ ధన్‌కర్ సందర్శిస్తానని చెప్పడం మరో వివాదానికి దారితీసింది. తన పర్యటనను రాష్ట్ర ప్రభుత్వం అడ్డుకోవడం రాజ్యాంగ విరుద్ధమని గవర్నర్ పేర్కొనడం ప్రాధాన్యం సంతరించుకుంది.
Samayam Telugu ప్రతీకాత్మక చిత్రం
mamata


ఎన్నికల ఫలితాల అనంతరం హింసాత్మక ఘటనలు జరిగిన ప్రాంతాలను సందర్శించేందుకు గవర్నర్ ధన్‌కర్ సన్నద్ధమయ్యారు. అందుకు తగిన ఏర్పాట్లు చేయాలని ఆయన రాష్ట్ర ప్రభుత్వానికి సూచించారు. అయితే అందుకు సంబంధించిన ఏర్పాట్ల గురించి రాష్ట్ర ప్రభుత్వం నుంచి ఎలాంటి ఏర్పాట్లు చేయకపోవడంపై గవర్నర్ అభ్యంతరం వ్యక్తం చేశారు. తన పర్యటనకు సంబంధించి ప్రభుత్వ అధికారుల నుంచి కనీస సమాచారం లేదని.. ఏర్పాట్ల గురించి కనీసం పట్టించుకోలేదని గవర్నర్ ధన్‌కర్ పేర్కొన్నారు. అలాంటి పర్యటనలేవీ పెట్టుకోవద్దని రాష్ట్ర ప్రభుత్వం చేసిన సూచనలను ఆయన తప్పుబట్టారు. ఇటీవల ఎన్నికలు జరిగిన రాష్ట్రాల్లో ఇలాంటి పరిస్ధితులు లేవని.. బెంగాల్‌లోనే ఇలాంటి ఘటనలు ఎందుకు జరుగుతున్నాయని ఆయన ప్రశ్నించారు. దీంతో బెంగాల్ గవర్నర్ వర్సెస్ సీఎం మమతా మధ్య నడుస్తున్న ఆధిపత్య పోరు చర్చనీయాంశంగా మారింది.

Also Read:

తరవాత కథనం

Telugu News App: ఏపీ, తెలంగాణకు సంబంధించిన లేటెస్ట్ అప్‌డేట్స్‌, జాతీయ, అంతర్జాతీయ, ఎడ్యుకేషన్, బిజినెస్, సినిమా, ఆధ్యాత్మికం, స్పోర్ట్స్, వైరల్ కథనాల కోసం తెలుగు సమయం యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి.
తాజా వార్తల అప్డేట్ల కోసం Samayam Telugu ఫేస్‌బుక్పేజీను లైక్ చెయ్యండి.