యాప్నగరం

యాంటిల్లాలో ముకేశ్ అంబానీతో మమతా బెనర్జీ భేటీ

బెంగాల్ సీఎం మమతా బెనర్జీ. రిలయన్స్ అధినేత ముకేశ్ అంబానీ నివసించే అత్యాధునిక భవనం యాంటిల్లాకెళ్లారు.

TNN 1 Nov 2017, 2:24 pm
పశ్చిమ బెంగాల్ ముఖ్యమంత్రి నాలుగు రోజులపాటు ముంబైలో పర్యటిస్తున్నారు. రాష్ట్రానికి పెట్టుబడులు ఆకర్షించడం కోసం ఆమె పారిశ్రామిక వేత్తలతో చర్చలు జరుపుతున్నారు. అందులో భాగంగానే రిలయన్స్ ఇండస్ట్రీస్ అధినేత ముకేశ్ అంబానీతోనూ ఆమె భేటీ అయ్యారు. ప్రపంచంలోకెల్లా అత్యంత విలాసవంతమైన నివాసమైన యాంటిల్లాలో అంబానీ ఉంటున్న సంగతి తెలిసిందే. మమత మంగళవారం ఆయన ఇంటికి వెళ్లి, డిన్నర్ చేశారు. రాత్రి 9:45 గంటల వరకూ యాంటిల్లాలోనే గడిపారామె. వచ్చే ఏడాది నిర్వహించబోయే బెంగాల్ గ్లోబల్ బిజినెస్ సమ్మిట్‌‌కు అంబానీని ఆహ్వానించారు. ఇటీవలే ఏపీ మంత్రి నారా లోకేశ్ కూడా ముంబై వెళ్లిన సందర్భంగా అంబానీతో సమావేశమైన సంగతి తెలిసిందే.
Samayam Telugu when mamata banerjee met mukesh ambani at antilia
యాంటిల్లాలో ముకేశ్ అంబానీతో మమతా బెనర్జీ భేటీ


భారత ఆర్థిక రాజధానిలో పర్యటించిన సందర్భంగా మంగళవారం సాయంత్రం తాజ్ మహల్ ప్యాలెస్‌లో మమత పారిశ్రామికవేత్తలతో భేటీ అయ్యారు. బీజేపీపై విమర్శలు గుప్పిస్తోన్న శివసేన అధినేత ఉద్ధవ్ థ్రాకేతోనూ ఆమె సమావేశం కానున్నారు.

గతంలో కమ్యూనిస్టులు అధికారంలో ఉన్న సమయంలో బెంగాల్లోని సింగూరులో నానో ప్లాంట్ ఏర్పాటుకు టాటా సంస్థ ముందుకొచ్చింది. కానీ తమకు తగిన పరిహారం చెల్లించడం లేదని రైతులు ఆందోళన చేపట్టారు. ప్రతిపక్షంలో ఉన్న మమతా బెనర్జీ వారికి మద్దతుగా నిలవడంతో టాటా సంస్థ నానో ప్రాజెక్ట్ ప్లాంట్‌ను గుజరాత్‌కు తరలించింది.

తరవాత కథనం

Telugu News App: ఏపీ, తెలంగాణకు సంబంధించిన లేటెస్ట్ అప్‌డేట్స్‌, జాతీయ, అంతర్జాతీయ, ఎడ్యుకేషన్, బిజినెస్, సినిమా, ఆధ్యాత్మికం, స్పోర్ట్స్, వైరల్ కథనాల కోసం తెలుగు సమయం యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి.
తాజా వార్తల అప్డేట్ల కోసం Samayam Telugu ఫేస్‌బుక్పేజీను లైక్ చెయ్యండి.