యాప్నగరం

ఆర్డర్లీ వ్యవస్థపై గళమెత్తిన జవాన్ ఆత్మహత్య?

ఆర్మీలో ఆర్డర్లీ (సహాయక్) వ్యవస్థపై గళమెత్తిన జవాన్ రాయ్ (33) మాథ్యు మహారాష్ట్రలోని డియోలలి కంటోన్మెంట్ లో అనుమాస్పద రీతిలో మృతి చెందాడు

TNN 3 Mar 2017, 4:13 pm
ఆర్మీలో ఆర్డర్లీ (సహాయక్) వ్యవస్థపై గళమెత్తిన జవాన్ రాయ్ (33) మాథ్యు మహారాష్ట్రలోని డియోలలి కంటోన్మెంట్ లో అనుమాస్పద రీతిలో మృతి చెందాడు. తన క్వార్టర్ లో ఫ్యాన్ కు ఉరి వేసుకొని ఆత్మహత్య చేసుకున్నాడు. మాథ్యు మూడు రోజుల ముందే చనిపోయినట్లు వైద్యులు ధృవీకరించారు. అయితే మాథ్యు ఆత్మహత్యపై పలు అనుమానాలు వ్యక్తమవుతున్నాయి.
Samayam Telugu whistleblower jawan roy mathew found dead in maharashtra
ఆర్డర్లీ వ్యవస్థపై గళమెత్తిన జవాన్ ఆత్మహత్య?


మాథ్యు ఇటీవల సైనికులు పైఅధికారులకు చెందిన కుక్కలు, పిల్లలను ఆడిస్తూ కనిపిస్తున్న దృశ్యాలను వీడియో తీశాడు. ఆయన తీసిన వీడియో ఇటీవల (ఫిబ్రవరి24న) ఒక వెబ్ సైట్లో కనిపించడం కలకలం సృష్టించింది.

అయితే ఆ వీడియో బయటకు వచ్చినప్పటి నుంచి మాథ్యు ఫిబ్రవరి 25 నుంచి అదృశ్యమయ్యాడని కుటుంబ సభ్యులు చెబుతున్నారు. అతడు సమాచారం ఇవ్వకుండా విధులకు డుమ్మా కొట్టాడని అధికారులు చెబుతున్నారు.

ఆ వీడియో తర్వాత తనపై పైఅధికారుల వేధింపులు పెరిగాయని..మానసికంగా వేధిస్తున్నారని ఆయన కుటుంబ సభ్యులతో వాపోయినట్ల తెలిసింది.

మాథ్యు ఆత్మహత్యకు పైఅధికారుల వేధింపులే కారణమని ఆయన కుటుంబ సభ్యులు ఆరోపిస్తున్నారు.

తరవాత కథనం

Telugu News App: ఏపీ, తెలంగాణకు సంబంధించిన లేటెస్ట్ అప్‌డేట్స్‌, జాతీయ, అంతర్జాతీయ, ఎడ్యుకేషన్, బిజినెస్, సినిమా, ఆధ్యాత్మికం, స్పోర్ట్స్, వైరల్ కథనాల కోసం తెలుగు సమయం యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి.
తాజా వార్తల అప్డేట్ల కోసం Samayam Telugu ఫేస్‌బుక్పేజీను లైక్ చెయ్యండి.