యాప్నగరం

బస్సుకు కట్టి ఊరేగించాల్సింది: ఒమర్

కేవలం ఒక సినిమాపై అభ్యంతరాలున్నంత మాత్రాన విచక్షణా రహితంగా పసిపిల్లలపై దాడి చేసిన వారిని అంత తేలిగ్గా ఎలా వదిలేస్తారని ప్రశ్నించారు.

TNN 27 Jan 2018, 4:28 pm
'పద్మావత్' సినిమాపై అభ్యంతరాలు వ్యక్తం చేస్తూ దేశవ్యాప్తంగా విధ్వంసం సృష్టిస్తోన్న కర్ణి సేన కార్యకర్తలను బస్సు కట్టేసి ఎందుకు ఊరేగించరని జమ్ముకశ్మీర్‌ మాజీ ముఖ్యమంత్రి ఒమర్‌ అబ్దుల్లా నిలదీశారు. ఢిల్లీ సమీపంలోని నోయిడాలో ఓ స్కూలు బస్సుపై విచక్షణా రహితంగా దాడి చేసి ముక్కుపచ్చలారని పిల్లల్ని భయబ్రాంతులకు గురి చేసిన వారి పట్ల ఈ మేరకు కఠినంగా వ్యవహరిస్తే తప్పేంటని ప్రశ్నించారు. కేవలం ఒక సినిమాపై అభ్యంతరాలున్నంత మాత్రాన విచక్షణా రహితంగా పసిపిల్లలపై దాడి చేసిన వారిని అంత తేలిగ్గా ఎలా వదిలేస్తారని ప్రశ్నించారు.
Samayam Telugu why arent karni sena goons tied in front of jeeps and paraded asks omar abdullah
బస్సుకు కట్టి ఊరేగించాల్సింది: ఒమర్


కిందటి సంవత్సరం శ్రీనగర్ లో అల్లర్లకు దిగిన ఆందోళనకారులు తమపై పెద్ద ఎత్తున రాళ్లు రువ్వితే... వారికి ధీటైన సమాధానం ఇవ్వడంతో పాటు సురక్షిత ప్రాంతాలకు చేరుకునేందుకు మేజర్ నితిన్‌ లీతుల్‌ ఓ కశ్మీరీ వ్యక్తిని జీపుకు కట్టేసి ఊరేగించారని. అప్పట్లో ఈ ఘటన దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించిందని అన్నారు. ఆందోళనకారులకు తగిన బుద్ది చెప్పారంటూ పలువురు ప్రశంసించారని గుర్తు చేశారు. కేంద్ర హోం మంత్రితో పాటు ఆర్మీ చీఫ్ కూడా మేజర్ నితిన్ నిర్ణయాన్ని సమర్థించారని చెప్పారు.

ఆందోళనకారులకు బుద్ది చెప్పేందుకు నాడు కాశ్మీర్లో తీసుకున్న నిర్ణయాన్ని ఇప్పుడు ఉత్తర భారతంలో ఉద్రిక్తలు సృష్టిస్తున్న కర్ణసేనపై ఎందుకు తీసుకోలేకపోతున్నారని ప్రశ్నించారు. ఈ మేరకు తన అసంతృప్తిని ట్విట్ చేశారు.

తరవాత కథనం

Telugu News App: ఏపీ, తెలంగాణకు సంబంధించిన లేటెస్ట్ అప్‌డేట్స్‌, జాతీయ, అంతర్జాతీయ, ఎడ్యుకేషన్, బిజినెస్, సినిమా, ఆధ్యాత్మికం, స్పోర్ట్స్, వైరల్ కథనాల కోసం తెలుగు సమయం యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి.
తాజా వార్తల అప్డేట్ల కోసం Samayam Telugu ఫేస్‌బుక్పేజీను లైక్ చెయ్యండి.