యాప్నగరం

బీజేపీపై దేవుడు పగబట్టాడట...

యూపీలో కమల దళం కంచుకోటకు బీటలు వారాయి. ఉప ఎన్నికల్లో బీజేపీకి పెద్ద షాకే తగిలింది. అలా ఫలితాలు వచ్చాయో లేదో... ఇలా కమలం పార్టీపై సెటైర్లు మొదలయ్యాయి.

TNN 14 Mar 2018, 8:08 pm
యూపీలో కమల దళం కంచుకోటకు బీటలు వారాయి. ఉప ఎన్నికల్లో బీజేపీకి పెద్ద షాకే తగిలింది. అలా ఫలితాలు వచ్చాయో లేదో... ఇలా కమలం పార్టీపై సెటైర్లు మొదలయ్యాయి. ఆ పార్టీ తాజా మాజీ మిత్రపక్షం శివసేన పంచ్‌లు పేల్చింది. చేసిన పనులు ఎక్కడికిపోతాయంటూ ఆ పార్టీ ఎంపీ సంజయ్ రౌత్ మండిపడ్డారు. ఎస్పీ బీఎస్పీ చేతులు కలపడం వల్ల ఈ ఫలితాలు వచ్చాయని భావించడం లేదు... శ్రీరాముడిని అవమానించిన ఎస్పీ నేతకు రెడ్ కార్పెట్ పరిచిన రోజే దేవుడు బీజేపీ నుంచి మొహం తిప్పుకున్నాడని వ్యాఖ్యానించారు. అప్పటి నుంచే బీజేపీపై దేవుడు పగబట్టాడని సెటైర్లు వేశారు.
Samayam Telugu why bjp may lose up bihar lok sabha bypolls according to shiv senas sanjay raut
బీజేపీపై దేవుడు పగబట్టాడట...


రౌత్ కామెంట్స్‌లో ముఖ్యంగా ఇటీవలే బీజేపీలో చేరిన నరేష్ అగర్వాల్‌ను ఉద్దేశించినట్లు కనిపిస్తున్నాయి. ఆయన్ను పార్టీలో చేర్చుకున్నప్పుడే దేవుడు బీజేపీపై పగబట్టినట్లు అర్థం వచ్చేలా సంజయ్ రౌత్ కామెంట్లు ఉన్నాయి. ఇప్పటికే ప్రతిపక్షాల నుంచి కమలం పార్టీపై పంచ్‌లు మొదలయ్యాయి. ఇది ఆరంభం మాత్రమేనని ఇప్పటికే పశ్చిమ బెంగాల్ సీఎం మమతా బెనర్జీ వ్యాఖ్యానించారు.

తరవాత కథనం

Telugu News App: ఏపీ, తెలంగాణకు సంబంధించిన లేటెస్ట్ అప్‌డేట్స్‌, జాతీయ, అంతర్జాతీయ, ఎడ్యుకేషన్, బిజినెస్, సినిమా, ఆధ్యాత్మికం, స్పోర్ట్స్, వైరల్ కథనాల కోసం తెలుగు సమయం యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి.
తాజా వార్తల అప్డేట్ల కోసం Samayam Telugu ఫేస్‌బుక్పేజీను లైక్ చెయ్యండి.