యాప్నగరం

అక్రమ సంబంధాల్లో దోషి పురుషుడేనా?

వివాహితుడు అయిన పురుషుడు, వివాహిత అయిన మరో స్త్రీతో లైంగిక సంబంధం పెట్టుకుంటే.. వాళ్లిద్దరి వ్యవహారం కోర్టు వరకూ వచ్చినప్పుడు..

TNN 9 Dec 2017, 12:06 pm
వివాహితుడు అయిన పురుషుడు, వివాహిత అయిన మరో స్త్రీతో లైంగిక సంబంధం పెట్టుకుంటే.. వాళ్లిద్దరి వ్యవహారం కోర్టు వరకూ వచ్చినప్పుడు.. విచారణ జరిగి, దోషిత్వాన్ని తేల్చాకా.. విధిస్తున్న శిక్షలు పురుషులకు మాత్రమేనా? అనే ప్రశ్నతో సుప్రీం కోర్టు ధర్మాసనం ముందు పిటిషన్ దాఖలైంది. ఇండియన్ పీనల్ కోడ్ లోని సెక్షన్ 497ను సవాల్ చేస్తూ.. జోసెఫ్ షినే అనే వ్యక్తి ఈ పిటిషన్ ను దాఖలు చేశాడు. భారత శిక్షాస్మృతిలో అక్రమ సంబంధాల్లో కేవలం పరుషుడికి మాత్రమే శిక్ష విధించే చట్టం ఉందని.. దీన్ని సవరించాలని ఆయన డిమాండ్ చేస్తున్నాడు. ఈ మేరకు ఏఎం ఖన్విల్కర్, డీవీ చంద్రచూడ్ ల ధర్మాసనం ఈ పిటిషన్ ను విచారణకు స్వీకరించింది.
Samayam Telugu why punish married men alone for adultery asks sc
అక్రమ సంబంధాల్లో దోషి పురుషుడేనా?


ఈ వ్యవహారంపై స్పందించాల్సిందిగా కేంద్ర ప్రభుత్వాన్ని ఆదేశించింది ధర్మాసనం. వివాహితులు అయిన స్త్రీ, పరుషులు లైంగిక సంబంధాన్ని అక్రమ సంబంధంగా పరిగణిస్తోంది న్యాయస్థానం. ఇది కేసు కాగల నేరం. అయితే అంత వరకూ వస్తే.. విచారణలో వారి మధ్య సంబంధం నిజమే అని తేలితే.. శిక్ష మాత్రం పురుషుడికి మాత్రమే అని చెబుతోంది చట్టం.

ఇలాంటి వ్యవహారాల్లో విచారణలో అక్రమ సంబంధం నిజమే అని తేలినప్పటికీ.. స్త్రీకి ఎలాంటి శిక్షా ఉండదు. చట్ట ప్రకారం ఇదే జరుగుతోంది. దశాబ్దాలుగా ఇదే చట్టం అమల్లో ఉంది. ఈ నేపథ్యంలో ఈ చట్టాన్ని మార్చాలని అంటూ పిటిషన్ దాఖలు చేశాడు జోసెఫ్. ఇతడి ఆసక్తిదాయకమైన పిటిషన్ ను ధర్మాసరం విచారణకు స్వీకరించింది. చట్టంలో మార్పు చేర్పులపై అభిప్రాయాన్ని తెలపాలని కేంద్ర ప్రభుత్వాన్ని ఆదేశించింది. అందుకు నాలుగు వారాల గడువును ఇచ్చింది. ఈ పిటిషన్ నేపథ్యంలో ఈ చట్టంలో ఎలాంటి మార్పులు వస్తాయో!

తరవాత కథనం

Telugu News App: ఏపీ, తెలంగాణకు సంబంధించిన లేటెస్ట్ అప్‌డేట్స్‌, జాతీయ, అంతర్జాతీయ, ఎడ్యుకేషన్, బిజినెస్, సినిమా, ఆధ్యాత్మికం, స్పోర్ట్స్, వైరల్ కథనాల కోసం తెలుగు సమయం యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి.
తాజా వార్తల అప్డేట్ల కోసం Samayam Telugu ఫేస్‌బుక్పేజీను లైక్ చెయ్యండి.