యాప్నగరం

సొంత పిల్లలపైనే తండ్రి అఘాయిత్యాలు

కంటికి రెప్పలా కాపాడుకోవాల్సిన సొంత పిల్లలపైనే ఓ తండ్రి లైంగిక దాడులు చేశాడు.

TNN 14 Oct 2016, 5:25 pm
కంటికి రెప్పలా కాపాడుకోవాల్సిన సొంత పిల్లలపైనే ఓ తండ్రి లైంగిక దాడులు చేశాడు. కొన్నేళ్ల నుంచి అతడు ఆ పనులు చేస్తున్న సంగతి భార్య తెలుసుకోలేకపోయింది. తాజాగా అతడి పాడుపనులు ఆమె దృష్టికి వెళ్లాయి. నీచుడిని కటాకటాల వెనక్కి పంపింది. ఈ ఘటన ఉత్తరప్రదేశ్ లోని లక్నోలో జరిగింది. స్థానిక ఇందిరానగర్ లో ఓ కుటుంబం నివసిస్తోంది. భర్త ఇంట్లోనే ఫుడ్ కార్నర్ నడుపుతుండగా, భార్య వేరే చోట బొటిక్ నడుపుతోంది. ఆమె తన ఉద్యోగంలో బిజీగా ఉండడంతో పిల్లల వ్యవహారాలు తండ్రే చూస్తున్నాడు.
Samayam Telugu wife sends husband to jail for rape and abuse of own kids
సొంత పిల్లలపైనే తండ్రి అఘాయిత్యాలు


కాగా రెండో రోజుల క్రితం తండ్రి తన మూడేళ్ల కొడుక్కి స్నానం చేయిస్తుండగా... ఆ పిల్లాడు గట్టిగా ఏడ్చాడు. వెంటనే తల్లి పరిగెట్టుకుని వెళ్లి పిల్లాడిని తీసుకుంది. కొడుకుని ఊరుకోబెట్టి ఏంజరిగిందో అడిగింది. తనకి స్నానం చేయిస్తూ తండ్రి చేసిన పని చెప్పాడు ఆ పిల్లాడు. కోపంతో ఊగిపోయింది ఆ ఇల్లాలు. వెంటనే తన 12 ఏళ్ల కూతురిని పిలిచి ఆమెని కూడా అడిగింది. కూతురు రెండేళ్ల వయసు నుంచి తండ్రి తనతో ఎలా ప్రవర్తిస్తున్నాడో చెప్పింది. కూతురిని బెదిరించి మరీ అతను పాడు పనులు చేస్తున్నాడని తెలుసుకుంది.

పిల్లల్ని ఆ రాక్షసుడి చేతిలో పెట్టి తాను పనికి వెళ్లినందుకు ఏడ్చింది. అనంతరం నేరుగా పోలీస్ స్టేషన్ కు వెళ్లి కేసు పెట్టింది. నిందితుడిని అరెస్టు చేశారు పోలీసులు. కాగా నిందితుడి తరుపు బంధవులు, తల్లిదండ్రులు కేసు వాపసు తీసుకోమంటూ బెదిరింపులకు దిగుతున్నారు. దీంతో తనకు రక్షణ కావాలని కోరింది ఆ ఇల్లాలు. పోలీసులు ఆమె ఇంటి దగ్గర కాపలా ఉంటున్నారు.

తరవాత కథనం

Telugu News App: ఏపీ, తెలంగాణకు సంబంధించిన లేటెస్ట్ అప్‌డేట్స్‌, జాతీయ, అంతర్జాతీయ, ఎడ్యుకేషన్, బిజినెస్, సినిమా, ఆధ్యాత్మికం, స్పోర్ట్స్, వైరల్ కథనాల కోసం తెలుగు సమయం యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి.
తాజా వార్తల అప్డేట్ల కోసం Samayam Telugu ఫేస్‌బుక్పేజీను లైక్ చెయ్యండి.