యాప్నగరం

సుస్థిర ప్రభుత్వం ఏర్పాటు చేస్తాం:OPS

సుస్థిర ప్రభుత్వాన్ని ఏర్పాటు చేస్తామని అపద్ధర్మ ముఖ్యమంత్రి ఓ పన్నీరుసెల్వం అన్నారు

Samayam Telugu 14 Feb 2017, 12:59 pm
సుస్థిర ప్రభుత్వాన్ని ఏర్పాటు చేస్తామని అపద్ధర్మ ముఖ్యమంత్రి ఓ పన్నీరుసెల్వం అన్నారు. మంగళవారం అన్నాడీఎంకే ప్రధానకార్యదర్శి శశికళను సుప్రీంకోర్టు దోషిగా ప్రకటించిన అనంతరం ఓపీఎస్ మీడియాతో మాట్లాడారు.
Samayam Telugu will form stable government in ammas name ops
సుస్థిర ప్రభుత్వం ఏర్పాటు చేస్తాం:OPS


‘‘అమ్మ (జయలలిత) ఆశయాలకు అనుగుణంగా నడుచుకుంటాం. రాష్ట్రంలో సుస్థిర ప్రభుత్వాన్ని ఏర్పాటు చేస్తాం. ప్రత్యర్థులు చీల్చడానికి ప్రయత్నిస్తున్నారు. ఐక్యంగా ఉందాం’’ అని ఓపీఎస్ పార్టీ నేతలకు పిలుపునిచ్చారు.

జైలుకెళ్లే ముందు పార్టీ శాసనసభా పక్ష నేతగా పళనిస్వామిని ఎన్నుకునేలా తన శిబిరంలో ఉన్న ఎమ్మెల్యేలకు చెప్పిన శశికళ...ఓపీఎస్ ను అన్నాడీఎంకే ప్రాథమిక సభ్యత్వం నుంచి తొలగించారు. రిసార్టును చుట్టుముట్టిన పోలీసులు ఏ క్షణంలోనైనా శశికళను అరెస్టు చేసే అవకాశం ఉంది.
అటు మరింత మంది ఎమ్మెల్యులు, ఎంపీలు ఓపీఎస్ కు మద్దతుగా నిలిచారు.

తరవాత కథనం

Telugu News App: ఏపీ, తెలంగాణకు సంబంధించిన లేటెస్ట్ అప్‌డేట్స్‌, జాతీయ, అంతర్జాతీయ, ఎడ్యుకేషన్, బిజినెస్, సినిమా, ఆధ్యాత్మికం, స్పోర్ట్స్, వైరల్ కథనాల కోసం తెలుగు సమయం యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి.
తాజా వార్తల అప్డేట్ల కోసం Samayam Telugu ఫేస్‌బుక్పేజీను లైక్ చెయ్యండి.