యాప్నగరం

చెక్క బండే అంబులెన్స్.. భర్తను ఆస్పత్రికి తీసుకెళ్లిన మహిళ

భర్తను కాపాడుకోవడానికి ఓ మహిళ చెక్క బండినే అంబులెన్స్‌గా మార్చేసింది. తన కొడుకుతో కలిసి బండిపై భర్తను పడుకోబెట్టి ఆస్పత్రికి తీసుకెళ్లింది. యూపీలోని ఆగ్రాలో ఈ ఘటన జరిగింది.

Samayam Telugu 8 Aug 2018, 4:08 pm
భర్తను కాపాడుకోవడానికి ఓ మహిళ చెక్క బండినే అంబులెన్స్‌గా మార్చేసింది. తన కొడుకుతో కలిసి బండిపై భర్తను పడుకోబెట్టి ఆస్పత్రికి తీసుకెళ్లింది. యూపీలోని ఆగ్రాలో ఈ ఘటన జరిగింది. స్థానికులు చెబుతున్న వివరాల ప్రకారం.. డెఢీ ప్రాంతానికి చెందిన జగదీష్ అనే వ్యక్తి బండిపై పండ్లను విక్రయించేవాడు. మూడు నెలల క్రితం అతడు రోడ్డు ప్రమాదంలో అతడు గాయపడ్డాడు. దీంతో జగదీష్ వెన్నెముక దెబ్బ తినింది. అతడికి సర్జరీ నిర్వహించగా.. అప్పటి నుంచి పాపం మంచానికే పరిమితం అయ్యాడు.
Samayam Telugu Cart


జగదీష్‌ రెండు రోజులుగా తీవ్ర జ్వరంతో బాధపడుతున్నాడు. భార్య రేఖ మందులు వేసినా తగ్గలేదు. దీంతో అతడ్ని దగ్గర్లో ఉన్న ఎస్‌ఎన్ మెడికల్ కాలేజీ ఆస్పత్రికి తీసుకెళ్లాని భావించింది. అయితే భర్త నడిచే పరిస్థితి లేకపోవడంతో ఎలా తీసుకెళ్లాలో అర్థం కాలేదు. దీంతో చెక్కబండి తీసుకొని అతడ్ని దానిపై పడుకోబెట్టింది. తన పదేళ్ల కుమారుడి సాయంతో ఆ బండిని తోసుకుంటూ ఆస్పత్రికి వెళ్లింది. అక్కడ డాక్టర్లు ట్రీట్మెంట్‌ను అందించారు.

రేఖ తన భర్తను ఇలా బండిపై తీసుకెళ్లడంతో అందరూ అంబులెన్స్ సర్వీస్ నిర్లక్ష్యమని భావించారు. కాని అసలు ఏం జరిగిందని ఆమెను అడిగితే కాని అసలు విషయం అర్థం కాలేదు. ఫ్రీ అంబులెన్స్ సర్వీస్ ఒకటి ఉంటుందని ఆమెకు తెలియదట. అందుకే ఇలా బండిపై తీసుకెళ్లానని అమాయకంగా చెప్పింది. కాని ఆమె బండిపై భర్తను తీసుకెళ్లడం చూసి అందరూ ప్రభుత్వ అధికారుల నిర్లక్ష్యమని భావించారు. కొంతమంది ఈ విషయంపై అత్యుత్సాహం ప్రదర్శించగా.. తర్వాత అసలు విషయం తెలియడంతో సైలెంట్ అయ్యారు.
Read This Story In English

తరవాత కథనం

Telugu News App: ఏపీ, తెలంగాణకు సంబంధించిన లేటెస్ట్ అప్‌డేట్స్‌, జాతీయ, అంతర్జాతీయ, ఎడ్యుకేషన్, బిజినెస్, సినిమా, ఆధ్యాత్మికం, స్పోర్ట్స్, వైరల్ కథనాల కోసం తెలుగు సమయం యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి.
తాజా వార్తల అప్డేట్ల కోసం Samayam Telugu ఫేస్‌బుక్పేజీను లైక్ చెయ్యండి.