యాప్నగరం

మతం మార్చుకుంటే ఆస్తిలో వాటా రాదా?

చెల్లెలి ఆస్తి కాజేయడం కోసం మతమార్పిడిని కారణంగా చూపించారు అన్నలు.

TNN 7 Jun 2017, 12:35 pm
చెల్లెలి ఆస్తి కాజేయడం కోసం మతమార్పిడిని కారణంగా చూపించారు అన్నలు. వారిపై న్యాయపోరాటం మొదలుపెట్టింది చెల్లెలు. అసలేమైందంటే... న్యూఢిల్లీలోకి చెందిన సోనియాకు వివాహమైంది. ఒక కూతురు కూడా ఉంది. ఆమె తండ్రి 2010లో మరణించారు. అప్పటికి ఇంకా ఆస్తులు పంచలేదు. సోనియా భర్త కూడా మరుసటి ఏడాదే క్యాన్సర్ తో మరణించాడు. దీంతో కూతురిని పెట్టుకుని ఇద్దరు అన్నల దగ్గరే ఉండేది. ఆమెకు రావాల్సిన ఆస్తిని కూడా వారు తమదగ్గరే ఉంచుకున్నారు. కాగా 2012లో హసన్ అనే వ్యక్తి సోనియాకు పరిచయం అయ్యాడు. అది ప్రేమగా మారి, పెళ్లి చేసుకోవడానికి సిద్ధపడ్డారు. హసన్ తన కుటుంబాన్ని ఒప్పించాడు. కానీ సోనియా కుటుంబం మాత్రం అందుకు అంగీకరించలేదు. కుటుంబం నుంచి ఆమెను బహిష్కరించారు.
Samayam Telugu woman denied share in parental property for converting to islam
మతం మార్చుకుంటే ఆస్తిలో వాటా రాదా?


ఆమె భర్తతో పాటూ ఆ మత ఆచారాలను పాటించడం మొదలుపెట్టింది. కాగా సోనియా అన్నలు ఆస్తిలో వాటా ఇవ్వడానికి నిరాకరించారు. ఆమె ముస్లింగా మారిందని, హిందూ ఆస్తిని పంచడానికి వీల్లేదని వాదించారు. దీంతో ఆమె కోర్టు మెట్లు ఎక్కింది. ఆస్తిలో తనకు వాటా ఇవ్వాలని ఆమె కోరారు. తన అన్నలు మోసం చేశారని, తన సంతకాన్ని ఫోర్జరీ చేశారని పోలీసులకు ఫిర్యాదు కూడా చేసింది. మత మార్పిడి చేసుకుంటే ఆస్తిలా వాటా వస్తుందా రాదా అన్ని విషయంపై కోర్టులో త్వరలో తీర్పు ఇవ్వనుంది.

తరవాత కథనం

Telugu News App: ఏపీ, తెలంగాణకు సంబంధించిన లేటెస్ట్ అప్‌డేట్స్‌, జాతీయ, అంతర్జాతీయ, ఎడ్యుకేషన్, బిజినెస్, సినిమా, ఆధ్యాత్మికం, స్పోర్ట్స్, వైరల్ కథనాల కోసం తెలుగు సమయం యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి.
తాజా వార్తల అప్డేట్ల కోసం Samayam Telugu ఫేస్‌బుక్పేజీను లైక్ చెయ్యండి.