యాప్నగరం

బిడ్డను రక్షించుకోవడానికి చిరుతతోనే పోరాడిన తల్లి

కన్న బిడ్డకు చిన్న దెబ్బ తగిలినా తల్లి మనసు విలవిలాడిపోతుంది. ఆ దెబ్బ తనకే తగిలినట్లే భావిస్తుంది అమ్మ. అలాంటిది బిడ్డ ప్రమాదంలో ఉంటే చూస్తూ మాతృమూర్తి మనసు ఆగుతుందా.. అనుమానమే లేదు ప్రాణాలు అడ్డువేసైనా కాపాడుకుంటుంది.

Samayam Telugu 26 May 2018, 9:41 pm
కన్న బిడ్డకు చిన్న దెబ్బ తగిలినా తల్లి మనసు విలవిలాడిపోతుంది. ఆ దెబ్బ తనకే తగిలినట్లే భావిస్తుంది అమ్మ. అలాంటిది బిడ్డ ప్రమాదంలో ఉంటే చూస్తూ మాతృమూర్తి మనసు ఆగుతుందా.. అనుమానమే లేదు ప్రాణాలు అడ్డువేసైనా కాపాడుకుంటుంది. తమిళనాడులోని కోయంబత్తూరు జిల్లాలో.. సరిగ్గా అలాంటి ఘటనే జరిగింది. చిరుత పులికి చిక్కిన కూతురి కోసం ప్రాణాలకు తెగించి పోరాడింది.. సమయస్ఫూర్తితో వ్యవహరించి బిడ్డను కాపాడి శభాష్ అనిపించుకుంది.
Samayam Telugu Leoperd


కోయంబత్తూరు జిల్లాలోని వల్పారాయ్‌కు చెందిన ముత్తులక్ష్మి అనే మహిళ కట్టె పుల్లల కోసం అడవిలోకి వెళ్లింది. తనతో పాటూ కూతుర్ని కూడా వెంట తీసుకెళ్లింది. ఆమె కట్టెలు ఏరుతుండగా.. ఓ పులి హఠాత్తుగా వచ్చి చిన్నారిపై పడిపోయింది. మెడ పట్టుకొని పక్కు లాక్కెళ్లే ప్రయత్నం చేసింది. వెంటనే గమనించిన ముత్తులక్ష్మి పక్కనే ఉన్న ఓ పెద్ద కర్రను తీసుకొంది.. చిరుతపై గట్టిగా ఓ దెబ్బ కొట్టింది. దీంతో బెదిరిపోయిన పులి అడవిలోకి పారిపోయింది. చిరుత పారిపోయాక పాపను తీసుకొని గ్రామానికి చేరుకోగా.. అక్కడి నుంచి ఆమెను దగ్గర్లోని ప్రభుత్వాసుపత్రికి తరలించారు. ప్రస్తుతం చిన్నారి కోలుకుంటున్నట్లు తెలుస్తోంది.

మరోవైపు గత 10 రోజులుగా వల్పారాయ్ ప్రాంతంలో తిరుగుతున్నట్లు స్థానికులు చెబుతున్నారు. ఇటీవల ఓ మహిళపై కూడా దాడి చేయగా.. తీవ్ర గాయాలయ్యాయంటున్నారు. అడవివైపు వెళ్లాలంటేనే తమకు వణకుపుడుతోందని.. అది గ్రామాల్లోకి వస్తే పరిస్థితి ఏంటని ప్రశ్నిస్తున్నారు. వెంటనే చిరుతను పట్టుకోవాలని కోరుతున్నారు. ఇటు ఈ ఘటనపై స్పందించిన అటవీశాఖ అధికారులు.. త్వరలోనే పులిని పట్టుకుంటామని చెబుతున్నారు.
Read This Story In English

తరవాత కథనం

Telugu News App: ఏపీ, తెలంగాణకు సంబంధించిన లేటెస్ట్ అప్‌డేట్స్‌, జాతీయ, అంతర్జాతీయ, ఎడ్యుకేషన్, బిజినెస్, సినిమా, ఆధ్యాత్మికం, స్పోర్ట్స్, వైరల్ కథనాల కోసం తెలుగు సమయం యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి.
తాజా వార్తల అప్డేట్ల కోసం Samayam Telugu ఫేస్‌బుక్పేజీను లైక్ చెయ్యండి.