యాప్నగరం

భర్తను చంపి బీఎండబ్లూ కారులో దాచేసింది

భర్తను చంపిన ఓ భార్య, అతడి మృతదేహాన్ని సూట్ కేసులో కుక్కి, అతడి బీఎండబ్ల్యూ కారులోనే దాచిపెట్టి పరారైంది.

TNN 20 Mar 2017, 11:13 pm
భర్తను చంపిన ఓ భార్య, అతడి మృతదేహాన్ని సూట్ కేసులో కుక్కి, అతడి బీఎండబ్ల్యూ కారులోనే దాచిపెట్టి పరారైంది. పంజాబ్‌లోని మొహాలీలో చోటుచేసుకున్న ఈ ఘటన శనివారం అర్థరాత్రి పొద్దుపోయాకా జరిగినట్టు పోలీసులు భావిస్తున్నారు. మృతుడికి భార్య శీరత్ కౌర్, 11 ఏళ్ల బాబు, 5 ఏళ్ల పాప వున్నారు. 15 రోజుల క్రితమే కొత్తగా ఇంట్లో అద్దెకి దిగిన కామ్ ధిల్లాన్ ఉన్నట్టుండి ఇలా భార్య చేతిలో హత్యకు గురవడం అనేక అనుమానాలకి తావిస్తోంది.
Samayam Telugu woman shot dead her husband stashed his body in a suitcase hides it in bmw
భర్తను చంపి బీఎండబ్లూ కారులో దాచేసింది


స్థానికులు అందించిన సమాచారం మేరకు ఘటనాస్థలానికి చేరుకున్న పోలీసులు కారులోంచి ధిల్లాన్ శవాన్ని స్వాధీనం చేసుకున్నారు. మృతుడు ధిల్లాన్ సోదరుడు మీడియాతో మాట్లాడుతు... అంతకన్నా ముందు రోజు రాత్రి తనకి ఫోన్ చేసిన తన సోదరుడు ఏడుస్తూ మాట్లాడినట్టు వెల్లడించారు. "తన సోదరుడు ఆరడుగుల ఎత్తు వుండే ఆజానుబాహుడని, అతడిని ఆమె ఒక్కరే ఒంటరిగా మట్టుపెట్టి, శవాన్ని తీసుకెళ్లి కారులో దాచిపెట్టడం అసంభవం'' అని అభిప్రాయపడుతున్న మృతుడి సోదరుడు.. కచ్చితంగా ఈ హత్య వెనుక మరో మగ మనిషి ప్రమేయం వుందని అనుమానం వ్యక్తంచేస్తున్నారు. ధిల్లాన్ శరీరంపై వున్న గాయాలు, ఇంట్లో లభ్యమైన తుపాకీ సైతం ఈ అనుమానాలకి బలాన్ని చేకూర్చుతోంది.

తరవాత కథనం

Telugu News App: ఏపీ, తెలంగాణకు సంబంధించిన లేటెస్ట్ అప్‌డేట్స్‌, జాతీయ, అంతర్జాతీయ, ఎడ్యుకేషన్, బిజినెస్, సినిమా, ఆధ్యాత్మికం, స్పోర్ట్స్, వైరల్ కథనాల కోసం తెలుగు సమయం యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి.
తాజా వార్తల అప్డేట్ల కోసం Samayam Telugu ఫేస్‌బుక్పేజీను లైక్ చెయ్యండి.