యాప్నగరం

Rajasthan: ఏకంగా పులికి రాఖీ కట్టి... మూగజీవాలపై ప్రేమను చాటుకున్న మహిళ

మూగజీవాలను (Rajasthan) ప్రేమించే వ్యక్తులు.. వాటి కోసం ఏదైనా చేస్తారు. అవి గాయపడితే అస్సలు చూడలేరు. వాటితో ప్రమాదం అని తెలిసినా సరే.. వాటి దగ్గరకు వెళ్లి సపర్యలు చేస్తుంటారు. రాజస్థాన్‌లో ఓ మహిళ.. తన ప్రేమను చాలా కొత్తగా వ్యక్తీకరించింది. రాఖీ పండుగ రోజు ఓ పులికి రాఖీ కట్టింది. దీనికి సంబంధించిన ఫోటో సోషల్ మీడియాలో వైరల్ అయింది. ఆ ఫోటోను చూసిన నెటిజన్లు మహిళపై ప్రశంసలు కురిపిస్తున్నారు.

Authored byAndaluri Veni | Samayam Telugu 13 Aug 2022, 5:19 pm

ప్రధానాంశాలు:

  • రాజస్థాన్‌లో వినూత్న ఘటన
  • గాయపడిన పులిపై ప్రేమను చూపిన మహిళ
  • సోషల్ మీడియాలో వైరల్ అయిన ఫోటో

హైలైట్స్ చదవాలంటే యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి
Samayam Telugu Woman ties rakhi
Rajasthan: పండుగల్లో రాఖీ పండుగకు ప్రత్యేకత ఉంది. అన్నాచెల్లెళ్లల, అక్క తమ్ముడుల మధ్య ఉండే బంధాన్ని ప్రతిబింబించే పండుగ ఇది. అంతేకాదు అన్నదమ్ములు.. అక్కలకు, తమ చెల్లెళ్లకు రక్షణగా ఉంటామని తెలియజేసే గొప్ప సంస్కృతి. అలాంటి పండుగ రోజున ఓ మహిళ విచిత్రంగా ఓ మూగ జీవానికి రాఖీ కట్టింది. వన్యప్రాణుల పట్ల తనకున్న ప్రేమను, అభిమానాన్ని చాటుకుంది. ఈ ఘటన రాజస్థాన్‌లో జరిగింది.
రాజస్థాన్‌లో ఓ మహిళ గాయపడిన ఓ చిరుపులికి రాఖీ కట్టింది. దీనికి సంబంధించిన ఫోటో నెట్‌లో హల్‌చల్ చేస్తోంది. సంబంధిత ఫోటోను ఇండియన్ ఫారెస్ట్ (IFS) అధికారి సుశాంత నందా ట్విట్టర్‌లో షేర్ చేశారు. గాయపడిన చిరుతపులిని స్థానిక అటవీ శాఖకు అప్పగించడానికి కొద్ది నిమిషాల ముందు ఓ మహిళ దానికి రాఖీ కట్టింది. హృదయాన్ని తాకే ఈ ఫోటోను పోస్ట్ చేస్తూ భారతదేశంలో మనుషులు, మూగ జీవాలతో ప్రత్యేక బంధాన్ని కలిగి ఉన్నారని, వారు ప్రేమతో జీవిస్తున్నారని సుశాంత నందా ట్వీట్‌లో పేర్కొన్నారు. "రాజస్థాన్‌లో ఓ మహిళ అనారోగ్యంతో బాధపడుతున్న ఓ పులికి ఇలా రాఖీ కట్టడం ద్వారా తన అపరిమితమైన ప్రేమ కనబడుతుంది." అని ఆయన పేర్కొన్నారు.


ఈ ఫోటోపై చాలామంది రియాక్ట్ అవుతున్నారు. మహిళ చేసిన పనిపై ప్రేమను కురిపిస్తున్నారు. "అడవులు, వన్యప్రాణులతో సహజీవనం చేయాలి. దేవుడు అన్ని రకాల జీవితాలను సృష్టించాడు. ప్రపంచం మానవులకు మాత్రమే కాదు" అని ఒక నెటిజన్ కామెంట్ పెట్టారు. అలాగే ప్రేమ, ఆప్యాయత చాలా అందంగా ఉంటుందని, దానికి రాఖీ కట్టడం నిదర్శనమని మరొకరు వ్యాఖ్యానించారు. ఈ పోస్ట్‌కి 900కి పైగా లైక్‌లు వచ్చాయి. చాలా మంది రీ-ట్వీట్ చేసారు.

Read Also: పసివాడిని కాటేయబోయిన కాల నాగు... తల్లి ఏం చేసిందో తెలిస్తే హడల్

తరవాత కథనం

Telugu News App: ఏపీ, తెలంగాణకు సంబంధించిన లేటెస్ట్ అప్‌డేట్స్‌, జాతీయ, అంతర్జాతీయ, ఎడ్యుకేషన్, బిజినెస్, సినిమా, ఆధ్యాత్మికం, స్పోర్ట్స్, వైరల్ కథనాల కోసం తెలుగు సమయం యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి.
తాజా వార్తల అప్డేట్ల కోసం Samayam Telugu ఫేస్‌బుక్పేజీను లైక్ చెయ్యండి.