యాప్నగరం

వాళ్ల కోసం వెళ్తే.. పోలీసులపై మహిళల దాడి

మహిళలు పోలీసులపై దాడి చేసిన సంఘటన ఇది. దాడి అంటే అలాంటిలాంటి దాడి కాదు...

TNN 10 Apr 2017, 2:20 pm
మహిళలు పోలీసులపై దాడి చేసిన సంఘటన ఇది. దాడి అంటే అలాంటిలాంటి దాడి కాదు... లాఠీలు, తూటాలతో వచ్చిన 26మంది పోలీసులను రాళ్లతో కొట్టారు. తరిమితరిమి కొట్టారు. అందులో ఓ పోలీసును పట్టుకొని కిరోసిన్ పోసి నిప్పంటించే ప్రమత్నమూ చేశారు.
Samayam Telugu women attack 26 police chasing snatchers tries to set 1 ablaze
వాళ్ల కోసం వెళ్తే.. పోలీసులపై మహిళల దాడి


ఈ సంఘటన ముంబైలోని అంబివ్వీలోని ఇరానీ బస్తీలో ఆదివారం చోటు చేసుకుంది. ఈ బస్తీ గొలుసు దొంగతనాలు, జేబు దొంగలుంటారని అంతా చెప్పుకుంటారు. వివిధ కేసుల్లో నిందితులుగా ఉన్న ఇద్దరు గొలుసు దొంగలను పట్టుకునేందుకు డీసీపీ సునీల్ భరద్వాజ్ నేతృత్వంలో 26 మంది పోలీసులు ఇరానీ బస్తీకి వెళ్లారు.

ఇద్దరు అనుమానిత గొలుసు దొంగలను పట్టుకున్న పోలీసులను తిరుగు ప్రయాణంలో వారి బంధువులు చుట్టుముట్టారు. పోలీసులను చుట్టుముట్టిన వాళ్లలో మహిళలే అధికంగా ఉన్నారు. రాళ్లతో పోలీసులపై దాడి చేశారు. ఒక పోలీసు కానిస్టేబుల్ పై కిరోసిన్ పోసి నిప్పటించేందుకు ప్రయత్నించారు. ఈ గందరగోళంలోనే ఆ ఇద్దరు దొంగలు తప్పించుకున్నారు. ఆ దొంగలను తప్పించడానికే తమపై దాడిచేశారని పోలీసులు చెబుతున్నారు.

అయితే దొంగగా అనుమానిస్తున్న సమీర్ బంధువులు మాత్రం.. అతన్ని తప్పుడు కేసులో ఇరికించేందుకు పోలీసులు కుట్ర పన్నారని అంటున్నారు. పోలీసులను చుట్టిముట్టిన వాళ్లలో ఒక వ్యక్తి కిరోసిన్ పోసుకొని ఆత్మహత్య ప్రయత్నం చేశాడు. ఇదే బస్తీవాసులు గతంలో పోలీసులపై పలుమార్లు దాడులు చేశారు.

తరవాత కథనం

Telugu News App: ఏపీ, తెలంగాణకు సంబంధించిన లేటెస్ట్ అప్‌డేట్స్‌, జాతీయ, అంతర్జాతీయ, ఎడ్యుకేషన్, బిజినెస్, సినిమా, ఆధ్యాత్మికం, స్పోర్ట్స్, వైరల్ కథనాల కోసం తెలుగు సమయం యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి.
తాజా వార్తల అప్డేట్ల కోసం Samayam Telugu ఫేస్‌బుక్పేజీను లైక్ చెయ్యండి.