యాప్నగరం

తలాక్ వల్ల మహిళల జీవితాలు ధ్వంసం: మోదీ

ట్రిపుల్ తలాక్ వల్ల ముస్లిం మహిళలు ఎంతో క్షోభ అనుభవిస్తున్నారని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ఆవేదన వ్యక్తం చేశారు

TNN 24 Oct 2016, 3:49 pm
ట్రిపుల్ తలాక్ వల్ల ముస్లిం మహిళలు ఎంతో క్షోభ అనుభవిస్తున్నారని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ఆవేదన వ్యక్తం చేశారు. ఉత్తర్ ప్రదేశ్ లోని బుందేల్ ఖండ్ లో ఏర్పాటు చేసిన ఎన్నికల ప్రచార ‘పరివర్తన మహార్యాలీ’లో ఆయన మాట్లాడారు.
Samayam Telugu women cannot be destroyed by triple talaq says pm modi
తలాక్ వల్ల మహిళల జీవితాలు ధ్వంసం: మోదీ


ట్రిపుల్ తలాక్ వల్ల ముస్లిం మహిళల జీవితాలు ధ్వంసమవుతున్నాయని మోదీ అన్నారు.
‘ఫోన్లో మూడు సార్లు తలాక్ అని చెప్పి మహిళలకు మగవారు విడాకులు ఇవ్వడం ఎంతరకు సమంజసం? దీన్ని రాజకీయం చేయడం ఎంతమాత్రం తగదు. కొన్నిరాజకీయ పార్టీలు ముస్లిం మహిళలు హక్కులు కోల్పోయేలా మాట్లాడం విచిత్రంగా ఉంది’ అని మోదీ అన్నారు. మహిళలు పురుషులతో సమానంగా ఆత్మగౌరవంతో జీవించాలని ఆయన స్పష్టం చేశారు.

ఉత్తర్ ప్రదేశ్ దేశానికి ఎంతో మంది ప్రధానులను ఇచ్చిందని...అందరికంటే తాను ఈ ప్రాంతానికి ఎక్కువ మేలు చేయాలని భావిస్తున్నానని మోదీ చెప్పారు. బుందేల్ ఖండ్ ప్రాంత అభివృద్ధికి ఎన్నో ప్రాజెక్టులు వచ్చినా ఏవీ అమలుకు నోచుకోలేదని ఆయన ఆరోపించారు.

ఉత్తర్ ప్రదేశ్ భూమి తల్లిలాంటిదని, దాన్ని ఆక్రమణకు గురిచేయాన్ని తాను అంగీకరించబోనని అన్నారు.

ఈ రాష్ట్రంలో అధికారం ఎస్పీ, బీఎస్పీల మధ్య మారుతుంది తప్ప ప్రజల బతుకులు ఏమాత్రం మారలేదని, బీజేపీ రాష్ట్రాభివృద్ధికి కట్టుబడి ఉందని అన్నారు.

తరవాత కథనం

Telugu News App: ఏపీ, తెలంగాణకు సంబంధించిన లేటెస్ట్ అప్‌డేట్స్‌, జాతీయ, అంతర్జాతీయ, ఎడ్యుకేషన్, బిజినెస్, సినిమా, ఆధ్యాత్మికం, స్పోర్ట్స్, వైరల్ కథనాల కోసం తెలుగు సమయం యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి.
తాజా వార్తల అప్డేట్ల కోసం Samayam Telugu ఫేస్‌బుక్పేజీను లైక్ చెయ్యండి.