యాప్నగరం

Sabarimalaలోకి మహిళల ప్రవేశం: గురువారం కేరళ బంద్‌

ఆలయంలోకి మహిళలు ప్రవేశించడంతో శబరిమల ప్రధాన అర్చకుడు ఆలయంలో సంప్రోక్షణ జరిపించిన విషయం తెలిసిందే. అయితే ఆలయం మూసివేత విషయంపై ట్రావెన్‌కోర్‌ దేవస్థానం‌ బోర్డు మండిపడింది.

Samayam Telugu 2 Jan 2019, 10:28 pm
50 ఏళ్లలోపు వయసున్న ఇద్దరు మహిళలు కేరళలోని శబరిమల ఆలయంలోకి ప్రవేశించడం రాష్ట్ర వ్యాప్తంగా ఉద్రిక్తలకు దారి తీసింది. కోలికోడ్‌ జిల్లాకు చెందిన లాయర్ బిందు, సామాజిక కార్యకర్త కనకదుర్గ బుధవారం తెల్లవారుజామున అయ్యప్పను దర్శించుకున్నారు. ఈ విషయం బయటకు వచ్చిన వెంటనే శబరిమలతో పాటు కేరళ రాష్ట్రంలో పలు ప్రాంతాల్లో మొదలైన ఆందోళనలు రాత్రి వరకు కొనసాగాయి. ఆ మహిళల ఆలయ ప్రవేశాన్ని వ్యతిరేకిస్తూ అందుకు నిరసనగా గురువారం (జనవరి 3న) కేరళ రాష్ట్రవ్యాప్త బంద్‌కు హిందూ సంఘాలు పిలుపునిచ్చాయి. శబరిమల కర్మ సమితి కూడా రేపు బంద్‌కు పిలుపునిచ్చింది.
Samayam Telugu Sabarimala


ఆలయంలోకి మహిళలు ప్రవేశించడంతో శబరిమల ప్రధాన అర్చకుడు ఆలయంలో సంప్రోక్షణ జరిపించిన విషయం తెలిసిందే. ఇందుకోసం గంటకు పైగా ఆలయాన్ని మూసివేశారు. అయితే ఆలయం మూసివేత విషయంపై ట్రావెన్‌కోర్‌ దేవస్థానం‌ బోర్డు మండిపడింది. ఆలయాన్ని మూసివేసిన విషయం తమకు తెలియదని, ఎందుకిలా చేశారని ప్రధాన అర్చకుడిని, సంబంధిత వ్యక్తుల వివరణ తీసుకుని చర్యలు తీసుకుంటామని బోర్డు తెలిపింది.

ఇద్దరు మహిళలు గట్టుచప్పుడు కాకుండా ఆలయంలోకి వెళ్తున్న వీడియో ఒకటి సోషల్‌మీడియాలో వైరల్‌ కావడంతో పాటు కేరళ ముఖ్యమంత్రి పినరయి విజయన్‌ కూడా ఈ విషయాన్ని ధ్రువీకరించారు. మహిళల ప్రవేశంతో ఆలయంలో అపచారం జరిగిందని ఓవైపు అర్చకులు సంప్రోక్షణ చేశారు. మరోవైపు బీజేపీ, హిందూ సంఘాలు, యువ మోర్చ కార్యకర్తలు అందోళన చేపట్టారు.

తరవాత కథనం

Telugu News App: ఏపీ, తెలంగాణకు సంబంధించిన లేటెస్ట్ అప్‌డేట్స్‌, జాతీయ, అంతర్జాతీయ, ఎడ్యుకేషన్, బిజినెస్, సినిమా, ఆధ్యాత్మికం, స్పోర్ట్స్, వైరల్ కథనాల కోసం తెలుగు సమయం యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి.
తాజా వార్తల అప్డేట్ల కోసం Samayam Telugu ఫేస్‌బుక్పేజీను లైక్ చెయ్యండి.