యాప్నగరం

వీరసైనికులకు నివాళి.. శ్రీనగర్లో నిశబ్దం

యూరీ ఉగ్రవాద దాడి ఘటనలో ప్రాణాలు కోల్పోయిన సైనికుల పార్థీవ దేహాలకు పుష్ప గుచ్ఛాలతో నివాళులు అర్పంచారు.

TNN 19 Sep 2016, 4:02 pm
యూరీలో ఆర్మీ క్యాంప్‌పై ఉగ్రవాద దాడి ఘటనలో మరణించిన సైనికుల పార్థీవ దేహాలకు నేడు శ్రీనగర్లో అంజలి ఘటించారు. జమ్ము కశ్మీర్ ముఖ్యమంత్రి మెహబూబా ముఫ్తీ కూడా ఈ అమర సైనికుల ముందు పుష్పగుచ్ఛాలు ఉంచి నివాళులు అర్పించారు. భద్రతా దళాలు కూడా వారికి నివాళి అర్పించాయి. ఈ కార్యక్రమం జరుగుతున్న శ్రీనగర్లో మాత్రం నిశబ్దం రాజ్యమేలింది. రోడ్ల మీదకు రావడానికి కూడా జనం సాహసించలేదు. దీంతో శ్రీనగర్లోని ప్రధాన కూడలి అయిన లాల్‌చౌక్ జనాలు లేక బోసిపోయింది. వీధుల్లో ఎటూ చూసినా నిశబ్దమే రాజ్యమేలింది.
Samayam Telugu wreath laying ceremony of 17 soldiers who died in uri terror attack in srinagar
వీరసైనికులకు నివాళి.. శ్రీనగర్లో నిశబ్దం


అమర సైనికులు వీరే..

శ్రీనగర్‌లోని కూడలి అయిన లాల్ చౌక్ చారిత్రక నేపథ్యాన్ని సొంతం చేసుకోవడానికి కారణం భారత తొలి ప్రధాని జవహర్‌లాల్ నెహ్రూ. కశ్మీర్‌లో ప్రజాభిప్రాయ సేకరణ చేస్తామన్న కీలక ప్రకటనను నవంబర్ 2, 1947న లాల్‌చౌక్‌లోనే నెహ్రూ చేశారు. ఆ సమయంలో ఆయనతో పాటు అప్పటి కాశ్మీర్ ప్రధాని షేక్ అబ్దుల్లా కూడా ఉన్నారు.

ఆ తర్వాత కూడా ఎన్నో కీలక సంఘటనలు లాల్‌చౌక్‌లో చోటు చేసుకున్నాయి. కశ్మీర్ రాజకీయ పార్టీలకు, వేర్పాటువాద సంస్థలకు ధర్నాలు, సభలు నిర్వహించుకోవడానికి ఇదే ప్రధాన వేదిక. నిత్యం ఏదో ఓ అలజడి ఈ ప్రాంతంలో చోటు చేసుకుంటూనే ఉంటుంది. 1980లో బజాజ్ ఎలక్ట్రికల్స్ లాల్‌చౌక్‌లో క్లాక్ టవర్‌ను నిర్మించింది. అప్పటినుంచి దీనికి మరింత గుర్తింపు వచ్చింది.

1992లో ఈ లాల్‌చౌక్‌కు రాజకీయ ప్రాధాన్యత ఏర్పడింది. కశ్మీర్‌లో పరిస్థితులను నిరసిస్తూ.. బిజేపీ అప్పటి అధ్యక్షుడు మురళీమనోహర్ జోషి క్లాక్‌టవర్‌పై త్రివర్ణ పతాకాన్ని ఎగరవేశారు. దీంతో వేర్పాటు వాదులు మరింత రెచ్చిపోయారు. ఆ తర్వాత కశ్మీర్‌లో ఆందోళనలు ఎక్కువయ్యాయి. 1993లో హింసాత్మక సంఘటనలు ఎక్కువగా జరగడంతో ఆర్మీ రంగంలోకి దిగింది. ఏప్రిల్ 10, 1993న లాల్‌చౌక్‌లో ఆందోళనకారులపై కాల్పులు జరిపింది. ఈ కాల్పుల్లో దాదాపు 125 మంది చనిపోయారు.

అప్పటి నుంచి 2009 వరకూ బీఎస్‌ఎఫ్, సీఆర్‌పీఎఫ్ ఆధ్వర్యంలో లాల్‌చౌక్‌లో జెండా వందనం జరిగేది. అయితే.. ఈ ప్రాంతానికి రాజకీయ ప్రాధాన్యం లేకపోవడంతో 2010 నుంచి భద్రతా దళాలు రద్దు చేశాయి.

Eerie silence in and around the centre of Srinagar as the wreath laying ceremony of the 17 martyrs goes on

తరవాత కథనం

Telugu News App: ఏపీ, తెలంగాణకు సంబంధించిన లేటెస్ట్ అప్‌డేట్స్‌, జాతీయ, అంతర్జాతీయ, ఎడ్యుకేషన్, బిజినెస్, సినిమా, ఆధ్యాత్మికం, స్పోర్ట్స్, వైరల్ కథనాల కోసం తెలుగు సమయం యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి.
తాజా వార్తల అప్డేట్ల కోసం Samayam Telugu ఫేస్‌బుక్పేజీను లైక్ చెయ్యండి.