యాప్నగరం

రచనలో ఆసక్తి ఉందా.. ఇదిగో ‘రైట్ ఇండియా క్యాంపెయిన్’

యువ ఔత్సాహిక రచయితలకు సరికొత్త అవకాశం. యంగ్ రచయితలో కథనాలతో రైట్ ఇండియా బుక్ విడుదల.

Samayam Telugu 6 Dec 2018, 12:39 am
ధునిక కాలంలో ఇంటర్నెట్ ప్రపంచం.. వ్యక్తిగత వికాసం, మెంటార్‌షిప్ కోసం సరికొత్త అవకాశాలను కల్పిస్తోంది. ఇ-కామర్స్, క్లాసికల్, సాహిత్యం.. ఇలా ఏ రంగానికి సంబంధించి అయినా.. ఇంటర్నెట్ కొత్త అవకాశాలను అందిస్తోంది. ఇదే క్రమంలో ఔత్సాహికులకు ప్రోత్సాహం కల్పించేలా టైమ్స్ ఆఫ్ ఇండియా ‘రైట్ ఇండియా క్యాం పెయిన్ (Write India Campaign)’తో ముందుకొచ్చింది.
Samayam Telugu write

దేశంలోని మంచి రచయితలను గుర్తించడం ఈ క్యాంపెయిన్ ప్రధాన ఉద్దేశం. అంతేకాకుండా వారికి ప్రముఖ రచయితలో అనుసంధానం కల్పించడం మరో లక్ష్యం. తద్వారా వారికి మరింత ప్రయోజనం చేకూరేలా చేయడానికే ఈ ప్రయత్నం.

మొదటిసారి నిర్వహించిన కార్యక్రమానికి వచ్చిన స్పందనతో ఈసారి ద్విగుణీకృత ఉత్సాహంతో రైట్ ఇండియా క్యాంపెయిన్ నిర్వహించాం. డిసెంబర్ 2న నిర్వహించిన ఫినాలేకు మంచి స్పందన లభించింది. ఔత్సాహిక రచయితలకు సంబంధించి దేశంలోనే అతిపెద్ద కార్యక్రమంగా వక్తలు అభివర్ణించారు.

31 మంది ఔత్సాహిక రచయితలు రాసిన కథనాలతో కూడిన ‘రైట్ ఇండియా బుక్ 2’ను సెలబ్రిటీ రచయితలు విడుదల చేశారు. ఈ సందర్భంగా టాప్ 10 రచయితను సన్మానించారు. మను జోసెఫ్, అమిత్ త్రిపాఠి, ఆనంద్ నీలకంఠన్ తదితర రచయితలు ఈ కార్యక్రమంలో పాల్గొని యంగ్ రచయితను ఉద్దేశించి ప్రసంగించారు. పలు సూచనలు చేశారు.


రచనాంగంలో ఆసక్తి ఉన్న యువకులకు ఇదొక మంచి అవకాశం. వారి రచనా శక్తిని మరింత రాటుదేల్చడానికి టైమ్స్ ఆఫ్ ఇండియా వారి రైట్ ఇండియా క్యాంపెయిన్ తోడ్పడుతుంది. మీ చుట్టుపక్కల యువ రచయితలు ఉంటే.. వారిని నిస్సందేహంగా ఈ కార్యక్రమానికి అనుసంధానం చేయొచ్చు.

తరవాత కథనం

Telugu News App: ఏపీ, తెలంగాణకు సంబంధించిన లేటెస్ట్ అప్‌డేట్స్‌, జాతీయ, అంతర్జాతీయ, ఎడ్యుకేషన్, బిజినెస్, సినిమా, ఆధ్యాత్మికం, స్పోర్ట్స్, వైరల్ కథనాల కోసం తెలుగు సమయం యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి.
తాజా వార్తల అప్డేట్ల కోసం Samayam Telugu ఫేస్‌బుక్పేజీను లైక్ చెయ్యండి.