యాప్నగరం

భారత్‌ను మరోసారి అవమానించిన అమెజాన్!!

జాతీయ జెండా నమూనాలో డోర్‌మ్యాట్లను విక్రయానికి పెట్టి, భారత దేశాన్ని అవమానించిన అమెజాన్‌ కెనడా తాజాగా మరో సాహసానికి ఒడిగట్టింది.

TNN 9 May 2017, 4:19 pm
మన జాతీయ జెండా నమూనాలో డోర్‌మ్యాట్లను విక్రయానికి పెట్టి, భారత దేశాన్ని అవమానించిన అమెజాన్‌ కెనడా తాజాగా మరో సాహసానికి ఒడిగట్టింది. కశ్మీర్‌లో సగ భాగం లేకుండా ఉన్న భారత చిత్రపటాన్ని ఆ సంస్థ వెబ్‌సైట్లో అమ్మకానికి పెట్టారు. డిల్లీలో బీజేపీ ప్రతినిధి ‘తజీందర్‌ పాల్‌’ దీన్ని గుర్తించి, ట్విటర్లో పోస్టు చేయడంతో.. ఈ విషయం వెలుగులోకి వచ్చింది. డీఐవైథింకర్‌ అనే సంస్థ డెకరేషన్‌ వాల్‌ స్టిక్కర్‌ కింద భారత చిత్రపటాన్ని ‘అమెజాన్‌ కెనడా’ సైట్లో అమ్మకానికి పెట్టింది. ఇందులో భారత సరిహద్దులు సరిగా లేవు. జమ్ము-కశ్మీర్‌‌లోని సగం ప్రాంతాలను భారత మ్యాప్‌ నుంచి తీసేశారు.
Samayam Telugu wrong indian map sold on amazon canada bjp leader tajinder pal slams website
భారత్‌ను మరోసారి అవమానించిన అమెజాన్!!


ఇటీవల ఈ అంశాన్ని గుర్తించిన తజీందర్‌.. ‘దీన్ని ఎట్టి పరిస్థితుల్లో అంగీకరించం. అమెజాన్‌ కెనడా తన సైట్‌ నుంచి ఆ మ్యాప్‌ను తొలగించాలి. వెంటనే అమ్మకాలు నిలిపేయాలి’ అని ట్విటర్‌ ద్వారా హెచ్చరించారు.
. @amazon @amazonca @AmazonHelp is selling distorted Map of India.Its unacceptable. Remove this from ur website & stop selling immediately pic.twitter.com/zpFm3xlTXC — Tajinder Pal S Bagga (@TajinderBagga) May 6, 2017
అమెజాన్ ఈ ఏడాది జనవరిలో మన త్రివర్ణ పతాకం లాంటి డోర్‌మ్యాట్లను విక్రయించడంపై దుమారం రేగిన విషయం తెలిసిందే. కేంద్ర విదేశాంగ మంత్రి సుష్మాస్వరాజ్‌ వెంటనే స్పందించడంతో అమెజాన్ వెనక్కి తగ్గింది. ఆ డోర్‌మ్యాట్ల అమ్మకాలను నిలిపేసి, తమ దేశానికి క్షమాపణ చెప్పాలని ఆమె అమెజాన్‌పై మండిపడ్డారు. అమెజాన్ తన తీరు మార్చుకోకపోతే.. భారతీయ వినియోగదారులు దాన్ని పాతాలానికి తొక్కడం ఖాయమే అవుతుంది.

తరవాత కథనం

Telugu News App: ఏపీ, తెలంగాణకు సంబంధించిన లేటెస్ట్ అప్‌డేట్స్‌, జాతీయ, అంతర్జాతీయ, ఎడ్యుకేషన్, బిజినెస్, సినిమా, ఆధ్యాత్మికం, స్పోర్ట్స్, వైరల్ కథనాల కోసం తెలుగు సమయం యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి.
తాజా వార్తల అప్డేట్ల కోసం Samayam Telugu ఫేస్‌బుక్పేజీను లైక్ చెయ్యండి.