యాప్నగరం

యోగేశ్వర్ దత్ వరకట్నం వింటే షాకవుతారు!

ఒలింపియన్ రెజ్లర్ యోగేశ్వర్ దత్ జనవరి 16న ఓ ఇంటివాడు కాబోతున్నాడు. హర్యానా కాంగ్రెస్ నేత జైభగవాన్ శర్మ

TNN 15 Jan 2017, 8:39 am
ఒలింపియన్ రెజ్లర్ యోగేశ్వర్ దత్ జనవరి 16న ఓ ఇంటివాడు కాబోతున్నాడు. హర్యానా కాంగ్రెస్ నేత జైభగవాన్ శర్మ తనయ శీతల్ ను వివాహమాడనున్న 34ఏళ్ల యోగేశ్వర్ నలుగురికి ఆదర్శంగా నిలవనున్నాడు.
Samayam Telugu yogeshwar dutt floors all with re 1 dowry
యోగేశ్వర్ దత్ వరకట్నం వింటే షాకవుతారు!


వరకట్నంగా కేవలం ఒకే ఒక్క రూపాయి తీసుకుంటున్నాడు. అది కూడా ఏదో శుభశకునంగా భావించే తీసుకుంటున్నానని...లేకపోతే ఆ రూపాయి కూడా వద్దని అంటున్నాడు.

‘‘మా ఇళ్లల్లో ఆడవారి పెళ్లిళ్లకు కట్నాలు ఇచ్చేందుకు మా పెద్దలు ఎన్ని ఇబ్బందులు పడ్డారో చూశాను. అప్పుడు రెజ్లర్ గా బాగా రాణించాలని, వరకట్నం తీసుకోకూడదని నిర్ణయించుకున్నాను’’ అని యోగేశ్వర్ శనివారం జరిగిన ఎంగేజ్ మెంట్ సందర్భంగా చెప్పాడు.

తన కల నిజమవుతున్నందుకు సంతోషంగా ఉందని, తన తండ్రి రామ్మేహర్ దత్, రెజ్లింగ్ తొలిగురువు సత్ బీర్ సింగ్ బతికుంటే బాగుండేది అని యోగేశ్వర్ అన్నారు.

తరవాత కథనం

Telugu News App: ఏపీ, తెలంగాణకు సంబంధించిన లేటెస్ట్ అప్‌డేట్స్‌, జాతీయ, అంతర్జాతీయ, ఎడ్యుకేషన్, బిజినెస్, సినిమా, ఆధ్యాత్మికం, స్పోర్ట్స్, వైరల్ కథనాల కోసం తెలుగు సమయం యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి.
తాజా వార్తల అప్డేట్ల కోసం Samayam Telugu ఫేస్‌బుక్పేజీను లైక్ చెయ్యండి.