యాప్నగరం

యోగి నిర్ణయాలు ప్రజలకు నచ్చాయ్

యోగి ఆదిత్యనాథ్ తాను ముఖ్యమంత్రి పదవి చేపట్టి దాదాపు నెల రోజులు అవుతోంది.

TNN 17 Apr 2017, 8:24 am
ఉత్తర్ ప్రదేశ్ సీఎం యోగి ఆదిత్యనాథ్ తాను ముఖ్యమంత్రి పదవి చేపట్టి దాదాపు నెల రోజులు అవుతోంది. ఈ నెల రోజులలో ఆయన ఎన్నో నిర్ణయాలు తీసుకున్నారు. అందులో కొన్ని వివాదాస్పదం కూడా అయ్యాయి. ఆయన తీసుకున్న నిర్ణయాలను దేశవ్యాప్తంగా చర్చనీయాంశమయ్యాయి. వీఐపీ సంస్కృతి వద్దని చెప్పడం, ప్రభుత్వ కార్యాలయాల్లో పాన్, గుట్కా నమల కూడదని ఆదేశాలు జారీచేయడం, అలాగే ప్రభుత్యోద్యోగులకు డ్రెస్ కోడ్ పెట్టడం, ముుఖ్యంగా గోవును కాపాడడానికి చేపడుతున్న చర్యలు, మహిళలను ఈవ్ టీజింగ్ నుంచి కాపాడేందుకు యాంటీ రోమియో స్క్వాడ్ లు... ఇలా చెప్పుకుంటూ పోతే ఎన్నో నిర్ణయాలు అమల్లోకి తెచ్చారు యోగి.
Samayam Telugu yogi adithyanath report card people happy with his decisions
యోగి నిర్ణయాలు ప్రజలకు నచ్చాయ్


ఈ నిర్ణయాలపైనా, ఆయన నెల రోజుల పాలన పైనా యూపీ ప్రజలు ఏం ఫీలవుతున్నారో తెలుసుకునేందుకు గావ్ కలెక్షన్ అనే సంస్థ సర్వే నిర్వహించింది. అందులో ప్రజలు యోగి తీసుకునే నిర్ణయాలు వివాదాస్పదంగా, సంచలనంగా ఉన్నాయని చెబుతూనే బాగున్నాయంటూ కితాబిస్తున్నారు. యాంటీ రోమియో స్క్వాడ్ పట్ల మాత్రం మహిళలు హర్షం వ్యక్తం చేస్తున్నారు. 20 జిల్లాల్లో రెండు వేల మంది ప్రజలతో మాట్లాడారు సర్వే నిర్వాహకులు. యోగి నెల రోజుల పాలనకు 71 శాతం మంది సంతృప్తితో ఉన్నారు. ఆయన తీసుకున్న నిర్ణయాలు సంచలనాలైనా... అవి రాష్ట్రాన్ని ముందుకే నడిపిస్తాయని ధీమా వ్యక్తం చేశారు. అయితే గో సంరక్షణ పేరుతో... ఆవులతో కనబడిన ప్రతివారిని చితక్కొట్టడం, చంపడం మాత్రం తమకు నచ్చడం లేదని చెప్పారు ఎక్కువ శాతం మంది ప్రజలు. ఆ దాడులు జరగకుండా చర్యలు తీసుకోవాల్సిన అవసరం ఉందని చెప్పారు.

తరవాత కథనం

Telugu News App: ఏపీ, తెలంగాణకు సంబంధించిన లేటెస్ట్ అప్‌డేట్స్‌, జాతీయ, అంతర్జాతీయ, ఎడ్యుకేషన్, బిజినెస్, సినిమా, ఆధ్యాత్మికం, స్పోర్ట్స్, వైరల్ కథనాల కోసం తెలుగు సమయం యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి.
తాజా వార్తల అప్డేట్ల కోసం Samayam Telugu ఫేస్‌బుక్పేజీను లైక్ చెయ్యండి.