యాప్నగరం

అధికారుల ఆస్తుల లెక్కలు అడిగిన కొత్త సీఎం!

ముఖ్యమంత్రిగా ప్రమాణస్వీకారం చేసిన వెంటనే, తన కేబినెట్ సహచరుల ఆస్తుల వివరాలు వెల్లడించమని ఆదేశించిన..

TNN 20 Mar 2017, 10:29 pm
ముఖ్యమంత్రిగా ప్రమాణస్వీకారం చేసిన వెంటనే, తన కేబినెట్ సహచరుల ఆస్తుల వివరాలు వెల్లడించమని ఆదేశించిన ఉత్తర్ ప్రదేశ్ కొత్త సీఎం యోగి ఆదిత్యానాథ్ ఇవాళ ఆ రాష్ట్ర అధికారులకి కూడా అదే హుకుం జారీ చేశారు. సోమవారం లోక్ భవన్‌లో అధికారులతో జరిగిన తొలి భేటీలోనే వారిని తమ మొత్తం ఆస్తుల వివరాలని (స్థిర, చర ఆస్తులు) ప్రకటించాల్సిందిగా స్పష్టంచేసిన యోగి ఆదిత్యానాథ్.. అందుకోసం వారికి 15 రోజుల గడువు విధించారు.
Samayam Telugu yogi adityanath directed officials to declare their assets within 15 days
అధికారుల ఆస్తుల లెక్కలు అడిగిన కొత్త సీఎం!


అధికారులతో పరిచయ వేదికగా జరిగిన ఈ భేటీలో ఎన్నికలకి ముందు మేనిఫెస్టోలో బీజేపీ ఇచ్చిన హామీలని నెరవేర్చే దిశగా అధికారులు కృషి చేయాల్సిందిగా సీఎం వారికి సూచించారని తెలిపారు ఇదే సమావేశానికి హాజరైన డిప్యూటీ సీఎం కేశవ్ ప్రసాద్ మౌర్య. సీఎం నేతృత్వంలో జరిగిన ఈ భేటికి వివిధ ప్రభుత్వ విభాగాల నుంచి మొత్తం 65 మంది ఉన్నతాధికారులు హాజరయ్యారు.

"రాష్ట్రంలో అవినీతిని అరికట్టడమే ప్రధాన లక్ష్యంగా బీజేపీ పనిచేస్తోందని, అందువల్లే మంత్రులని సైతం తమ ఆస్తుల వివరాలు వెల్లడించాల్సిందిగా సీఎం ఆదేశించారు" అని అన్నారు ఆ రాష్ట్ర మంత్రి శ్రీకాంత్ శర్మ.

తరవాత కథనం

Telugu News App: ఏపీ, తెలంగాణకు సంబంధించిన లేటెస్ట్ అప్‌డేట్స్‌, జాతీయ, అంతర్జాతీయ, ఎడ్యుకేషన్, బిజినెస్, సినిమా, ఆధ్యాత్మికం, స్పోర్ట్స్, వైరల్ కథనాల కోసం తెలుగు సమయం యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి.
తాజా వార్తల అప్డేట్ల కోసం Samayam Telugu ఫేస్‌బుక్పేజీను లైక్ చెయ్యండి.