యాప్నగరం

వివాదస్పద బిల్లుకు యోగి గ్రీన్ సిగ్నల్!

వ్యవస్థీకృత నేరాలను అరికట్టేందుకు ఉత్తర్‌ప్రదేశ్ సర్కారు ఓ బిల్లును అసెంబ్లీలో ప్రవేశపెట్టింది. యూపీ కోకా పేరుతో ఈ వివాదస్పద బిల్లును రూపొందించారు.

TNN 21 Dec 2017, 11:39 am
సమాజ్‌వాదీ పార్టీ పాలనలో పెరిగిపోయిన అరాచకాలకు అడ్డుకట్ట వేస్తామనే హామీతో అధికారంలోకి వచ్చిన బీజేపీ సర్కారు ఆ దిశగా ప్రయత్నాలు ప్రారంభించింది.అత్యాచారాలకు, మాఫియాలు, నేరస్థులకు నిలయంగా మారిన ఉత్తర్‌ప్రదేశ్‌ను ప్రక్షాళన గావించేందుకు యోగి ఆదిత్యనాథ్ ప్రభుత్వం నడుంబిగించింది. దీనిలో భాగంగా మాఫియా, భూబకాసురులను పీచమణించేందుకు వీలుగా యూపీ కోకా పేరిట తీసుకొస్తున్న వివాదాస్పద బిల్లుకు యోగి సర్కారు గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. యూపీలో వ్యవస్థీకృత నేరాలను అరికట్టేందుకు కోకా బిల్లును అసెంబ్లీలో ప్రవేశపెట్టి చట్టం తీసుకురానున్నారు. ఈ చట్టం అమల్లోకి వస్తే నేరస్థులకు రూ.25 లక్షల జరిమానాతోపాటు మూడేళ్లపాటు జైలు శిక్ష విధించే అవకాశముంది.
Samayam Telugu yogi adityanath tables controversial upcoca bill in assembly
వివాదస్పద బిల్లుకు యోగి గ్రీన్ సిగ్నల్!


నేరాలను నియంత్రించేందుకు 28 అదనపు అవకాశాలున్న ఈ బిల్లుకు అసెంబ్లీ ఆమోదం లభిస్తే ఆయా కేసుల విచారణకు ప్రత్యేక కోర్టులను కూడా ఏర్పాటు చేయాలని యూపీ సర్కారు యోచిస్తోంది. గత మార్చిలో జరిగిన యూపీ అసెంబ్లీ ఎన్నికల్లో భారతీయ జనతా పార్టీ అఖండ విజయాన్ని సాధించింది. యూపీ ముఖ్యమంత్రిగా బాధ్యతలు చేపట్టిన యోగి ఆదిత్యనాథ్ ప్రారంభంలో దూకుడు చూపించారు. అయితే యోగి తీసుకున్న కొన్ని నిర్ణయాలు వివాదస్పదం కావడంతో కాస్తా వెనక్కు తగ్గారు. తాజాగా బీజేపీ ప్రభుత్వం తీసుకొస్తున్న ఈ బిల్లుపై వివాదాలు చుట్టుముట్టాయి. ఈ వివాదస్పద బిల్లును అమోదించి, చట్టం చేస్తే నేరస్థులకు కంటిమీద కనుకే కరవవుతుంది.

తరవాత కథనం

Telugu News App: ఏపీ, తెలంగాణకు సంబంధించిన లేటెస్ట్ అప్‌డేట్స్‌, జాతీయ, అంతర్జాతీయ, ఎడ్యుకేషన్, బిజినెస్, సినిమా, ఆధ్యాత్మికం, స్పోర్ట్స్, వైరల్ కథనాల కోసం తెలుగు సమయం యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి.
తాజా వార్తల అప్డేట్ల కోసం Samayam Telugu ఫేస్‌బుక్పేజీను లైక్ చెయ్యండి.