యాప్నగరం

యూపీ సీఎం యోగికి గుజరాత్ ‘బాధ్యతలు’!

ఉత్తర్ ప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికల్లో బంపర్ మెజార్టీ సాధించిన బీజేపీ రానున్న గుజరాత్ ఎన్నికల్లోనూ భారీ విజయం సాధించాలని వ్యూహరచ చేస్తోంది.

TNN 27 Mar 2017, 4:57 pm
ఉత్తర్ ప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికల్లో బంపర్ మెజార్టీ సాధించిన బీజేపీ రానున్న గుజరాత్ ఎన్నికల్లోనూ భారీ విజయం సాధించాలని వ్యూహరచ చేస్తోంది. ‘యూపీలో 325 గుజరాత్ లో 150’ అనే నినాదంలో గుజరాత్ అసెంబ్లీలో 150 సీట్లు గెలుచుకునేలా లక్ష్యంగా చేసుకొని కమలనాథులు ముందుకు కదులుతున్నారు.
Samayam Telugu yogi adityanath to be bjps star campaigner in gujarat election
యూపీ సీఎం యోగికి గుజరాత్ ‘బాధ్యతలు’!


ఈ యాడాది డిసెంబర్ లో గుజరాత్ అసెంబ్లీ ఎన్నికలు జరుగనున్నాయి.

ఉత్తర్ ప్రదేశ్ ఎన్నికల అనంతరం అనుహ్యంగా సీఎంగా పదవీ బాధ్యతలు చేపట్టిన యోగి ఆదిత్యనాత్ కు గుజరాత్ ప్రచార బాధ్యతలు అప్పగించాలని బీజేపీ అదిష్టానం నిర్ణయించింది. ‘‘గుజరాత్ ఎన్నికల్లో బీజేపీ తరపున ప్రచారం చేసేందుకు రూపొందించిన మొదటి లిస్టులో యోగి ఆదిత్యనాథ్ పేరు చేర్చాం’’ అని గుజరాత్ బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు జితు వాఘాని తెలిపారు.

ప్రధానమంత్రి నరేంద్ర మోదీ సొంత రాష్ట్రంలో జరుగుతున్న ఈ ఎన్నికలను బీజేపీ అత్యంత ప్రతిష్టాత్మకంగా తీసుకోనుంది. ఈ ఎన్నికల ప్రచారంలో మోదీ సహా బీజేపీ జాతీయ అధ్యక్షుడు అమిత్ షా కూడా పాల్గొంటారు.

15 ఏళ్లుగా బీజేపీకి కంచుకోటగా ఉన్న గుజరాత్ లో 2015లో జరిగిన పంచాయతీ ఎన్నికల్లో 31 జిల్లా పంచాయతీలకు గానూ 23 కాంగ్రెస్ గెలుచుకొని కమలనాథులకు షాకిచ్చింది.

దీంతోపాటు తమను బీసీ జాబితాలో చేర్చాలని పటేళ్లు ఉద్యమించారు. దళితులు, ముస్లింలపై కూడా ఇక్కడ దాడులు పెరిగాయి. దీంతో బీజేపీ కాస్త కలవరంగానే ఉంది.

ఇటీవల ప్రధాని గుజరాత్ లో పర్యటించినప్పుడు సీఎం విజయ్ రూపానీ సహా ఇతర సీనియర్లతో మంతనాలు జరిపారు. ఎన్నికలకు సిద్ధం కావాలని సూచించారు.

తరవాత కథనం

Telugu News App: ఏపీ, తెలంగాణకు సంబంధించిన లేటెస్ట్ అప్‌డేట్స్‌, జాతీయ, అంతర్జాతీయ, ఎడ్యుకేషన్, బిజినెస్, సినిమా, ఆధ్యాత్మికం, స్పోర్ట్స్, వైరల్ కథనాల కోసం తెలుగు సమయం యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి.
తాజా వార్తల అప్డేట్ల కోసం Samayam Telugu ఫేస్‌బుక్పేజీను లైక్ చెయ్యండి.