యాప్నగరం

త్వరలో నగదు లావాదేవీలన్నీ ఆధార్‌తోనే!

భారత్‌ను నగదు రహిత ఆర్థిక వ్యవస్థగా మార్చేందుకు కేంద్ర ప్రభుత్వం చర్యలు ప్రారంభించింది.

TNN 1 Dec 2016, 6:52 pm
భారత్‌ను నగదు రహిత ఆర్థిక వ్యవస్థగా మార్చేందుకు కేంద్ర ప్రభుత్వం చర్యలు ప్రారంభించింది. ఇకపై క్రెడిట్, డెబిట్ కార్డు లావాదేవీలను ఆధార్ కార్డుతో భర్తీ చేయాలని కేంద్రం నిర్ణయించింది. దేశంలో డిజిటల్ పేమెంట్స్‌ను ప్రోత్సహించడం కోసం నీతి ఆయోగ్ ఈ మేరకు చర్యలు ప్రారంభించింది. అలాగే ఆటంకాలులేని నగదు లావాదేవీల కోసం ఒక స్పష్టమైన విధానాన్ని త్వరలో కేంద్ర ప్రభుత్వం తీసుకురానుంది.
Samayam Telugu your 12 digit aadhaar number could soon replace all card transactions
త్వరలో నగదు లావాదేవీలన్నీ ఆధార్‌తోనే!


ఆధార్ ద్వారా జరిగే లావాదేవీలు కార్డు, పిన్ రహితంగా ఉంటాయని యూనిక్ ఐడెంటిఫికేషన్ అథారిటీ ఆఫ్ ఇండియా (UIDAI) డైరెక్టర్ జనరల్ అజయ్ పాండే వెల్లడించారు. త్వరలో ఆండ్రాయిడ్ స్మార్ట్‌ఫోన్ వినియోగదారులు ఆధార్ నంబర్, వేలిముద్ర, ఐరిస్ ద్వారా డిజిటల్ లావాదేవీలు చేసుకోవచ్చని వివరించారు.

నిజానికి దీని కోసం కేంద్ర ప్రభుత్వం పెద్ద వ్యూహరచనే చేసింది. ఈ ‘ఆధార్’ ఆధారిత డిజిటల్ లావాదేవీలనేవి వివిధ శాఖల సమ్మేళనం. దీనిలో మొబైల్ తయారీ కంపెనీలు, వ్యాపార సంస్థలు, బ్యాంకులు మిళితమై ఉంటాయి. ఈ మేరకు ప్రభుత్వం ఇప్పటికే వివిధ దారుల్లో పని మొదలుపెట్టింది.

భారత్‌లో తయారయ్యే స్మార్ట్‌ఫోన్లలో ఐరిస్ లేదా వేలిముద్ర గుర్తింపు వ్యవస్థ ఉండాలని ఇప్పటికే మొబైల్ తయారీ కంపెనీలను అడిగినట్లు నీతి ఆయోగ్ సీఈవో అమితాబ్ కాంత్ వెల్లడించారు. వచ్చే సంవత్సరం లోపల డిజిటల్ పేమెంట్స్‌ను అమలుచేయడానికి రోడ్‌మ్యాప్ తయారుచేస్తున్న ముఖ్యమంత్రుల కమిటీలో అమితాబ్ కాంత్ కూడా ఉన్నారు. ఈ కమిటీ గురువారం తొలిసారి సమావేశమైంది.

తరవాత కథనం

Telugu News App: ఏపీ, తెలంగాణకు సంబంధించిన లేటెస్ట్ అప్‌డేట్స్‌, జాతీయ, అంతర్జాతీయ, ఎడ్యుకేషన్, బిజినెస్, సినిమా, ఆధ్యాత్మికం, స్పోర్ట్స్, వైరల్ కథనాల కోసం తెలుగు సమయం యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి.
తాజా వార్తల అప్డేట్ల కోసం Samayam Telugu ఫేస్‌బుక్పేజీను లైక్ చెయ్యండి.