టిక్ టాక్... ప్రస్తుతం జనం బాగా వాడే సోషల్ మీడియా ఫ్లాట్ ఫామ్. కాలేజీ కుర్రాళ్ల నుంచి ఇంట్లో ఆంటీలు, ముసలాళ్ల వరకు ఇప్పుడు టిక్ టాక్ వీడియోలు చేస్తూ హల్ చల్ చేస్తుంటారు. అయితే ఇవన్నీ సరదాల కోసం కొందరు చేస్తే మరికొందరు మాత్రం స్టంట్లు చేస్తూ... ప్రాణాల మీదకు తెచ్చుకుంటున్నారు. తాజాగా టిక్ టాక్ వీడియో కోసం ... ఓ యవకుడు ప్రాణాలు పోగొట్టుకున్నాడు. ఈ దుర్ఘటన ఉత్తర్ ప్రదేశ్ ముజఫర్ నగర్ జిల్లాలో చోటు చేసుకుంది. కింధిధియా అనే గ్రామానికి చెందిన 23 ఏళ్ల యువకుడు టిక్ టాక్ వీడియోలు చేస్తుంటాడు. ఇతనికి రెండేళ్ల క్రితం పెళ్లి జరిగింది. కపిల్‌కు ట్రాక్టర్ నడపాలంటే ఎంతో ఇష్టం. ఆ ఇష్టంతోనే.. బుధవారం ట్రాక్టర్ నడుపుతూ టిక్ టాక్ వీడియో చేద్దామనుకున్నాడు.
ట్రాక్టర్‌తో స్టంట్ చేసే ప్రయత్నం చేశాడు. సినిమా స్టైల్లో ట్రాక్టర్‌ను గాల్లో లేపాలనుకున్నాడు. వేగంగా వేళ్తూ ట్రాక్టర్ ముందు చక్రాల్ని గాల్లోకి లేపేందుకు ప్రయత్నించాడు. ఈ ప్రయత్నంలో ట్రాక్టర్ ఒక్కసారిగా అదుపు తప్పింది. వెంటనే బోల్తా పడింది. దీంతో దాన్ని నడుపుతున్న కపిల్ కంట్రోల్ చేయలేక ట్రాక్టర్ కింద పడ్డాడు. అక్కడికక్కడే మృతి చెందాడు. టిక్ టాక్ కోసం వీడియో తీస్తుండటంతో ఈ ప్రమాదం జరగడంతో... ఇదంతా సెల్ ఫోన్లో రికార్డ్ అయ్యింది. అయితే ఈ వీడియోను తీస్తున్న వ్యక్తికి మాత్రం ఎలాంటి ప్రమాదం జరగలేదు.
టిక్ టాక్ స్టంట్లు చేస్తూ... ఇప్పటికే చాలామంది యువకులు ప్రాణాలు పోగట్టుకున్నారు. అనేక మంది గాయాల పాలయ్యారు. అయినప్పటికీ జనం తీరులో మాత్రం మార్పు రావడం లేదు. టిక్ టాక్ చేస్తూ అనసవరంగా ప్రాణాలు పోగొట్టుకుంటున్నారు. తమను నమ్ముకున్న కుటుంబాలకు తీరని బాధను మిగుల్చుతున్నారు.