యాప్నగరం

గోడ దూకిన ఎమ్మెల్యేలపై రాష్ట్రపతికి ఫిర్యాదు

వైఎస్సార్ సీపీ అధినేత వైఎస్ జగన్మోహన్ రెడ్డి గురువారం ఢిల్లీలో రాష్ట్రపతి ప్రణబ్ ముఖర్జీని కలిశారు.

Samayam Telugu 6 Apr 2017, 3:04 pm
వైఎస్సార్ సీపీ అధినేత వైఎస్ జగన్మోహన్ రెడ్డి గురువారం ఢిల్లీలో రాష్ట్రపతి ప్రణబ్ ముఖర్జీని కలిశారు. ఆయన వెంట వైసీపీ నేతలున్నారు. వైసీపీ గుర్తుపై ఎమ్మెల్యేలుగా గెలిచి టీడీపీలో చేరిన ఇటీవల మంత్రి పదవులు నలుగురిపై జగన్ ప్రణబ్ కు ఫిర్యాదు చేశారు. ఆంధప్రదేశ్ లో ఫిరాయింపుల నిరోధకంగా చట్టం ప్రకారం ఆ నలుగురు మంత్రులుగా అనర్హులని ఆయన పేర్కొన్నారు.
Samayam Telugu ys jagan meets president pranab complained against tdp
గోడ దూకిన ఎమ్మెల్యేలపై రాష్ట్రపతికి ఫిర్యాదు


సీఎం చంద్రబాబు నాయుడు ప్రజాస్వామ్యాన్ని అపహాస్యం చేస్తున్నారని జగన్ మండిపడ్డారు. ఎమ్మెల్యేలను కొనుగోలు చేస్తున్నారని ఆరోపించారు. ఆయన వెంట ఎంపీలు మేకపాటి రాజమోహన్ రెడ్డి, విజయసాయిరెడ్డి, వైవీ సుబ్బారెడ్డి, వైఎస్ అవినాష్ తదితరులు ఉన్నారు.

గత ఆదివారం చంద్రబాబు తన కేబినేట్ ను విస్తరించారు. వైసీపీ నుంచి టీడీపీలో చేరిన నలుగురు ఎమ్మెల్యేలు మంత్రి పదవులు పొందడంపై జగన్ గవర్నర్ ఈఎస్ ఎల్ నరసింహాన్ కూడా ఫిర్యాదు చేశారు.

తరవాత కథనం

Telugu News App: ఏపీ, తెలంగాణకు సంబంధించిన లేటెస్ట్ అప్‌డేట్స్‌, జాతీయ, అంతర్జాతీయ, ఎడ్యుకేషన్, బిజినెస్, సినిమా, ఆధ్యాత్మికం, స్పోర్ట్స్, వైరల్ కథనాల కోసం తెలుగు సమయం యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి.
తాజా వార్తల అప్డేట్ల కోసం Samayam Telugu ఫేస్‌బుక్పేజీను లైక్ చెయ్యండి.