యాప్నగరం

రాష్ట్రపతి ఎన్నిక: బీజేపీకి వైసీపీ మద్దతు

వచ్చే రాష్ట్రపతి ఎన్నికలో బీజేపీ నేతృత్వంలో ఎన్డీయే కూటమి అభ్యర్థికి వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ మద్దతు ప్రకటించింది.

Samayam Telugu 10 May 2017, 2:56 pm
వచ్చే రాష్ట్రపతి ఎన్నికలో బీజేపీ నేతృత్వంలోని ఎన్డీయే కూటమి అభ్యర్థికి వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ మద్దతు ప్రకటించింది. బీజేపీ నిలబెట్టే అభ్యర్థికే తమ ఓటు అని వెల్లడించింది. అత్యున్నత పదవి అయిన రాష్ట్రపతి ఎన్నిక ఏకగ్రీవంగా జరిగాలని ఆ పార్టీ అధినేత వైఎస్ జగన్మోహన్ రెడ్డి అభిప్రాయపడ్డారు. కేంద్రంలో బీజేపీకి సంఖ్యాపరంగా బలం ఉన్నందున.. మిగతా ఎవరు అభ్యర్థిని నిలబెట్టినా ఓడిపోతారని... అలాంటప్పుడు పోటీ చేయడం దేనికని జగన్ అన్నారు. ప్రణబ్ ముఖర్జీ లాంటి వారికి తాము మద్దతు ఇచ్చిన విషయాన్ని ఆయన గుర్తు చేశారు. బుధవారం జగన్ ప్రధానమంత్రి మోదీని ఢిల్లీలోని ఆయన నివాసంలో కలిశారు. పలు అంశాలపై ఆయనతో చర్చించారు.
Samayam Telugu ys jaganmohan reddy calls on pm modi special status for ap
రాష్ట్రపతి ఎన్నిక: బీజేపీకి వైసీపీ మద్దతు


పార్టీ ఫిరాయించి చంద్రబాబు కేబినెట్ లో మంత్రి పదవులు పొందిన నలుగురిపై మోదీకి ఫిర్యాదు చేసినట్లు జగన్ తెలిపారు. తమ పార్టీ గుర్తుపై గెలిచిన వారికి ఏపీ సీఎం మంత్రి పదవులు కట్టబెట్టి ప్రజాస్వామ్యాన్ని అపహాస్యం చేశారని జగన్ మీడియాతో అన్నారు.

అగ్రిగోల్డ్ బాధితులకు న్యాయం జరిగేలా చూడాలని తాము మోదీకి ఫిర్యాదు చేశామని జగన్ చెప్పారు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి ప్రత్యేక హోదా కల్పించాలని కోరినట్లు తెలిపారు. ఎన్నికల సమయంలో బీజేపీ ఇచ్చిన హామీని నిలబెట్టుకోవాలని జగన్ సూచించారు.

మిర్చికి మద్దతు ధర రూ.5వేలు ఇస్తామని కేంద్రం ప్రకటించం హర్షణీయమని జగన్ అన్నారు. అయితే కేంద్రం ఇచ్చే రూ.5వేలకు రాష్ట్రప్రభుత్వం మరో రూ.3 వేలు కలిపి మొత్తం రూ.8వేలు ఇస్తే బాగుంటుందని ఆయన అభిప్రాయపడ్డారు.

చంద్రబాబు అవినీతిపై తాము రూపొందించిన ‘ఎంపరర్ ఆఫ్ కరప్షన్’ అనే పుస్తకాన్ని మోదికి అందించామని జగన్ చెప్పారు.

తరవాత కథనం

Telugu News App: ఏపీ, తెలంగాణకు సంబంధించిన లేటెస్ట్ అప్‌డేట్స్‌, జాతీయ, అంతర్జాతీయ, ఎడ్యుకేషన్, బిజినెస్, సినిమా, ఆధ్యాత్మికం, స్పోర్ట్స్, వైరల్ కథనాల కోసం తెలుగు సమయం యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి.
తాజా వార్తల అప్డేట్ల కోసం Samayam Telugu ఫేస్‌బుక్పేజీను లైక్ చెయ్యండి.