యాప్నగరం

జకీర్ నాయక్ ఫౌండేషనుపై త్వరలో వేటు

వివాదాస్పద ఇస్లామిక్ బోధకుడు జకీర్ నాయక్ కు చెందిన ఫౌండేషనుపై త్వరలో వేటు పడనుంది.

TNN 28 Oct 2016, 12:15 am
వివాదాస్పద ఇస్లామిక్ బోధకుడు జకీర్ నాయక్ కు చెందిన ఫౌండేషనుపై త్వరలో వేటు పడనుంది. ఈ మేరకు దీనిపై కేంద్ర హోం శాఖ కసరత్తు చేస్తోంది. అది త్వరలోనే పూర్తి కావచ్చని, ఆ వెంటనే ఆ ఫౌండేషనును నిషేధిస్తామని హోంశాఖ వర్గాలు తెలిపాయి. ఇందుకు సంబంధించి ఒక కేంద్ర క్యాబినెట్ ముందుకు ఒక నోటును హోంశాఖ సిద్ధం చేస్తోంది. తీవ్రవాద నిరోధక చట్టం కింద జకీర్ నాయక్ ఫౌండేషనును నిషేధించనున్నట్లు ఆ నోటులో పేర్కొంటారు. ఇస్లామిక్ రీసెర్చ్ ఫౌండేషన్ పేరిట (ఐఆర్ఎఫ్) పేరిట దేశ వ్యతిరేక కార్యకలాపాలకు జకీర్ పాల్పడుతున్నట్లు ఆరోపణలున్న సంగతి తెలిసిందే. ఆయన చేసే టీవీ ప్రసంగాలు పలువురు అమాయక యువకులను తీవ్రవాదులుగా మారేలా చేశాయని, వందలాది మంది యువకులు తీవ్రవాదంవైపు మొగ్గుచూపుతున్నారంటే దానికి కారణం జకీర్ ప్రసంగాలేనని అంటున్నారు. పీస్ టీవీ అనే అంతర్జాతీయ ఇస్లామిక్ చానల్లో జకీర్ నాయక్ ప్రసంగాలను పలు ఇస్లామిక్ దేశాలు ఎప్పుడో బ్యాన్ చేశాయి. కానీ, మొన్నటి వరకు మనదేశంలో ఆయన ప్రసంగాలు నిరాటంకంగా కొనసాగాయి.
Samayam Telugu zakir naiks islamic research foundation to be banned soon home ministry
జకీర్ నాయక్ ఫౌండేషనుపై త్వరలో వేటు


ముంబై కేంద్రంగా ఆ ఫౌండేషన్ కార్యకలాపాలపై ఇప్పటికే మహారాష్ట్ర పోలీసులు కూలంకషంగా దర్యాప్తు పూర్తిచేసి, తమ నివేదికను కేంద్రానికి సమర్పించారు. ఆ నివేదిక ఆధారంగానే కేంద్ర హోం శాఖ ఆ ఫౌండేషనుపై వేటు వేసే దిశగా ముందుకు కదులుతోంది.

తరవాత కథనం

Telugu News App: ఏపీ, తెలంగాణకు సంబంధించిన లేటెస్ట్ అప్‌డేట్స్‌, జాతీయ, అంతర్జాతీయ, ఎడ్యుకేషన్, బిజినెస్, సినిమా, ఆధ్యాత్మికం, స్పోర్ట్స్, వైరల్ కథనాల కోసం తెలుగు సమయం యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి.
తాజా వార్తల అప్డేట్ల కోసం Samayam Telugu ఫేస్‌బుక్పేజీను లైక్ చెయ్యండి.