యాప్నగరం

మెక్సికోలో దుండగుల కాల్పులు... 24 మంది మృతి

డ్రగ్స్‌ డీ అడిక్షన్‌ కేంద్రంలోకి చొరబడిన దుండగులు విచక్షణా రహితంగా కాల్పులకు పాల్పడ్డారు. ఈ కాల్పుల్లో అనేకమంది అక్కడికక్కడే ప్రాణాలు వదిలారు.

Samayam Telugu 2 Jul 2020, 9:15 am
మెక్సికోలో దారుణం చోటు చేసుకుంది. దుండగులు జరిపిన కాల్పుల్లో 24 మంది ప్రాణాలు కోల్పోయారు. ఇరపాటో నగరంలోని మాదక ద్రవ్యాల బాధితుల పునరావాస కేంద్రంలో ఈ ఘటన చోటు చేసుకుంది. డ్రగ్స్‌ డీ అడిక్షన్‌ కేంద్రంలోకి చొరబడిన దుండగులు ఒక్కసారిగా కాల్పులకు తెగబడ్డారు. దీంతో 24 మంది అక్కడికక్కడే మృతి చెందారు. మృతదేహాలు రక్తపు మడుగులో పడి ఘటనా స్థలం భయానకంగా మారింది. కాల్పుల ఘటన వెనుక డ్రగ్స్‌ ముఠాల హస్తం ఉండొచ్చని అనుమానిస్తున్నారు.
Samayam Telugu మెక్సికో పోలీస్ (ఫైల్ ఫోటో)


నెల రోజులుగా నగరంలో ఇది రెండవ ఘటన అని పోలీస్ వర్గాలు చెబుతున్నాయి. కాల్పుల్లో పోలీసులు సైతం గాయాల పాలయ్యారు.
మెక్సికో అధ్యక్షుడిగా ఆండ్రెస్ మాన్యువల్ లోపెజ్ ఒబ్రాడోర్ 19 నెలల క్రితం అధికారం చేపట్టినప్పటి నుంచి దేశంలో ఇలాంటి దాడుల సంఖ్య కాస్త తగ్గింది. కానీ ఇప్పుడు మరోసారి వరుస దాడులు జరుగుతన్నాయి. తాజాగా జరిగిన కాల్పుల ఘటన 2020లో ఏడాదిలో అతి పెద్ద నరమేధంగా అక్కడి వారు భావిస్తున్నారు.

తరవాత కథనం

Telugu News App: ఏపీ, తెలంగాణకు సంబంధించిన లేటెస్ట్ అప్‌డేట్స్‌, జాతీయ, అంతర్జాతీయ, ఎడ్యుకేషన్, బిజినెస్, సినిమా, ఆధ్యాత్మికం, స్పోర్ట్స్, వైరల్ కథనాల కోసం తెలుగు సమయం యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి.
తాజా వార్తల అప్డేట్ల కోసం Samayam Telugu ఫేస్‌బుక్పేజీను లైక్ చెయ్యండి.