యాప్నగరం

నెత్తురోడిన లాహోర్.. 26 మంది మృతి

పాకిస్థాన్‌‌లోని పంజాబ్ రాష్ట్ర రాజధాని లాహోర్ పేలుళ్లతో దద్దరిల్లింది. పంజాబ్‌ ముఖ్యమంత్రి షాబాజ్‌ షరీఫ్‌ నివాసానికి..

TNN 24 Jul 2017, 9:44 pm
పాకిస్థాన్‌‌లోని పంజాబ్ రాష్ట్ర రాజధాని లాహోర్ పేలుళ్లతో దద్దరిల్లింది. పంజాబ్‌ ముఖ్యమంత్రి షాబాజ్‌ షరీఫ్‌ నివాసానికి అత్యంత సమీపంలో సోమవారం సాయంత్రం జరిగిన ఆత్మాహుతి దాడిలో 26మంది చనిపోగా, మరో 57మంది తీవ్రంగా గాయపడ్డారు. మృతి చెందిన వారు, గాయపడిన వారిలో పోలీసులు కూడా వున్నారు. అక్కడి భద్రతా బలగాలే లక్ష్యంగా ఈ దాడి జరిగినట్టు లాహోర్‌ పోలీసు చీఫ్‌ కెప్టెన్‌ ఆర్‌ అమిన్‌ ప్రకటించారు. చనిపోయిన పోలీసుల్లో ఒక సబ్-ఇన్‌స్పెక్టర్, ఒక ఏఎస్సై, ఆరుగురు కానిస్టేబుల్స్ వున్నారు.
Samayam Telugu 26 dead 57 injured in suicide blast in pakistans lahore
నెత్తురోడిన లాహోర్.. 26 మంది మృతి


పాకిస్థాన్‌ ప్రధాని నవాజ్‌ షరీఫ్‌‌కి సోదరుడైన పంజాబ్‌ సీఎం షాబాజ్‌ షరీఫ్‌ ఇంటికి కూతవేటు దూరంలోనే వున్న ఆర్ఫా కరీం టవర్స్ వద్ద ఈ ఆత్మాహుతి దాడి జరిగింది. దాడి జరిగిన సమయంలో స్థానిక మునిసిపల్ అధికారులు అక్రమ కట్టడాల కూల్చివేత పనుల్లో నిమగ్నమై వుండటంతో ఘటనాస్థలంలో జనం భారీ సంఖ్యలో గుమికూడి వున్నారు. పేలుల్ల వల్ల మృతిచెందిన వారి సంఖ్య అధికంగా వుండటానికి ఇది కూడా ఓ కారణమైంది. ఈ దాడికి తమదే బాధ్యత అని ఇంకా ఏ ఉగ్రవాద సంస్థ ప్రకటించలేదు.

తరవాత కథనం

Telugu News App: ఏపీ, తెలంగాణకు సంబంధించిన లేటెస్ట్ అప్‌డేట్స్‌, జాతీయ, అంతర్జాతీయ, ఎడ్యుకేషన్, బిజినెస్, సినిమా, ఆధ్యాత్మికం, స్పోర్ట్స్, వైరల్ కథనాల కోసం తెలుగు సమయం యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి.
తాజా వార్తల అప్డేట్ల కోసం Samayam Telugu ఫేస్‌బుక్పేజీను లైక్ చెయ్యండి.