యాప్నగరం

చర్చిలో కాల్పులు.. 26 మంది మృతి

అమెరికాలో మరోసారి విషాదం చోటు చేసుకుంది. టెక్సాస్‌లో ఓ చర్చిలో ఆదివారం (నవంబర్ 5) ప్రార్థనలు జరుగుతున్న సమయంలో ఓ దుండగుడు విచక్షణరహితంగా కాల్పులకు పాల్పడ్డాడు. దీంతో 26 మంది ప్రాణాలు కోల్పోయారు.

TNN 6 Nov 2017, 9:00 am
అమెరికాలో మరోసారి విషాదం చోటు చేసుకుంది. టెక్సాస్‌లో ఓ చర్చిలో ఆదివారం (నవంబర్ 5) ప్రార్థనలు జరుగుతున్న సమయంలో ఓ దుండగుడు విచక్షణరహితంగా కాల్పులకు పాల్పడ్డాడు. దీంతో 26 మంది ప్రాణాలు కోల్పోయారు. మరో 20 మందికి పైగా గాయపడ్డారు. గాయపడ్డ వారిలో కొంత మంది పరిస్థితి విషమంగా ఉంది. సదర్‌లాండ్‌ స్ప్రింగ్స్‌లోని ఫస్ట్‌ బాప్టిస్ట్‌ చర్చిలో సుమారు 50 మంది ప్రార్థనలు చేస్తుండగా.. చర్చిలోకి వచ్చిన దుండగుడు విచక్షణారహితంగా కాల్పులు జరిపాడు. ఆ ఆగంతుకుడు నల్లటి దుస్తుల్లో ఉన్నట్లు ప్రత్యక్ష సాక్షులు తెలిపారు.
Samayam Telugu 26 killed after a gunman opens fire at texas church
చర్చిలో కాల్పులు.. 26 మంది మృతి


ఓ స్థానిక వ్యక్తి అత్యంత సాహసోపేతంగా అతణ్ని అడ్డుకోవడంతో కొందరి ప్రాణాలు దక్కాయి. కాల్పులకు పాల్పడిన తర్వాత పారిపోతున్న దుందగుణ్ని భద్రతా సిబ్బంది మట్టుబెట్టారు. దుండగుడు గతంలో అమెరికన్‌ ఎయిర్‌ఫోర్స్‌లో పని చేసిన కెల్లీగా అధికారులు గుర్తించారు.

తరవాత కథనం

Telugu News App: ఏపీ, తెలంగాణకు సంబంధించిన లేటెస్ట్ అప్‌డేట్స్‌, జాతీయ, అంతర్జాతీయ, ఎడ్యుకేషన్, బిజినెస్, సినిమా, ఆధ్యాత్మికం, స్పోర్ట్స్, వైరల్ కథనాల కోసం తెలుగు సమయం యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి.
తాజా వార్తల అప్డేట్ల కోసం Samayam Telugu ఫేస్‌బుక్పేజీను లైక్ చెయ్యండి.