యాప్నగరం

ఫ్రాన్స్ లో విషాదం.. 75మందికి పైగా మృతి

ఫ్రాన్స్‌ జాతీయ దినోత్సవం సందర్భంగా నైస్‌ నగరంలో జరగుతున్న బాస్టిల్‌ డే సంబరాల్లో ప్రమాదం సంభవించింది.

TNN 15 Jul 2016, 6:22 am
ఫ్రాన్స్‌లో విషాదం చోటుచేసుకుంది. ఫ్రాన్స్‌ జాతీయ దినోత్సవం సందర్భంగా నైస్‌ నగరంలో జరగుతున్న బాస్టిల్‌ డే సంబరాల్లో ప్రమాదం సంభవించింది. గురువారం రాత్రి పెద్ద ఎత్తునా అక్కడి నగరవాసులు ఉత్సవంలో పాల్గొన్నారు. ఈ సమయంలో ఆకస్మాత్తుగా ఓ ట్రక్కు జనాలపైకి దూసుకొచ్చింది. ఈ ప్రమాదంలో 75 మందికిపైగా మృతిచెందారు. 100 మందికి పైగా తీవ్రంగా గాయపడ్డారు. కాగా ట్రక్కు దూసుకెళ్లిన ఘటనను పోలీసులు దాడిగా అభివర్ణించారు. ట్రక్కులోని వ్యక్తులు, పోలీసుల మధ్య కాల్పులు జరిగాయి. సమాచారం అందుకున్న ఫ్రాన్స్‌ సైనికదళాలు అక్కడికి చేరుకుని సహాయక చర్యలు చేపట్టాయి. మృతుల సంఖ్య పెరిగే అవకాశం ఉంది.
Samayam Telugu 75 feared dead as truck rams into crowd in france
ఫ్రాన్స్ లో విషాదం.. 75మందికి పైగా మృతి







Mouvement de panique !! #Nice pic.twitter.com/RgXar3fWZs — HARP DETECTIVES (@harp_detectives) July 14, 2016

తరవాత కథనం

Telugu News App: ఏపీ, తెలంగాణకు సంబంధించిన లేటెస్ట్ అప్‌డేట్స్‌, జాతీయ, అంతర్జాతీయ, ఎడ్యుకేషన్, బిజినెస్, సినిమా, ఆధ్యాత్మికం, స్పోర్ట్స్, వైరల్ కథనాల కోసం తెలుగు సమయం యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి.
తాజా వార్తల అప్డేట్ల కోసం Samayam Telugu ఫేస్‌బుక్పేజీను లైక్ చెయ్యండి.