యాప్నగరం

హాకింగ్ రెండేళ్లే బతుకుతాడన్నారు.. కానీ మరో 50 ఏళ్లు జీవించాడు

దశాబ్దాలుగా వీల్‌చైర్‌కే పరిమితమైన స్టీఫెన్ హాకింగ్ మరో రెండేళ్లు మాత్రమే బతకుతాడని డాక్టర్లు చెప్పారు. కానీ 50 ఏళ్లకు పైగా జీవించడమే కాదు.. మేటి భౌతికశాస్త్రవేత్తగా పేరు గడించాడు.

Samayam Telugu 14 Mar 2018, 12:30 pm
సరిగ్గా గెలీలియో మరణించిన 300 ఏళ్ల తర్వాత.. 1942 జనవరి 8న ఇంగ్లాండ్‌లో జన్మించిన స్టీఫెన్ హాకింగ్.. ఐన్‌స్టీన్ 229వ జయంతి రోజున కన్నుమూశారు. విశ్వం రహస్యాలను చేధించేందుకు ఆయన అహర్నిశలు శ్రమించారు. కృష్ణ బిలాలు, జనరల్ రిలేటివిటీపై ఆయన విస్తృత స్థాయిలో పరిశోధనలు జరిపారు. ఆయన 21వ ఏటే 'యామ్యోట్రోఫిక్‌ లేటరల్‌ సెలరోసిస్‌' (ఏఎల్‌ఎస్‌) అనే మోటార్‌ న్యూరోన్‌ వ్యాధి బారిన పడ్డారు. ఇది నాడీ మండలంపై ప్రభావం చూపి క్రమంగా శరీరం అచేతనంగా మారుతుంది.
Samayam Telugu a brief history of stephen hawking
హాకింగ్ రెండేళ్లే బతుకుతాడన్నారు.. కానీ మరో 50 ఏళ్లు జీవించాడు


ఈ వ్యాధి కారణంగా రెండున్నరేళ్లలోపే హాకింగ్ చనిపోతాడని డాక్టర్లు తెలిపారు. పీహెచ్‌డీ పట్టా అందుకోకుండానే ఆయన మరణిస్తాడని చెప్పిన డాక్టర్ల అంచనాలు తప్పని నిరూపిస్తూ.. హాకింగ్ మరో 50 ఏళ్లకు పైగా జీవించారు. సైగలనే మాటలుగా మార్చే పరికరం సాయంతో.. వీల్ చైర్‌లో నుంచి కదల్లేని స్థితిలోనే ప్రయోగాలు చేస్తూ.. సాటి వారికి ఆదర్శంగా నిలిచాడు. 20వ శతాబ్దపు అత్యుత్తమ భౌతిక శాస్త్రవేత్తగా ఎదిగాడు.

శరీరం సహకరించకున్నా.. కేంబ్రిడ్జి యూనివర్సిటీ నుంచి అప్లయిడ్ మ్యాథమెటిక్స్ అండ్ థియెరిటికల్ ఫిజిక్స్‌లో పీహెచ్‌డీ పూర్తి చేశారాయన.

1988లో ‘ఏ బ్రీఫ్ హిస్టరీ ఆఫ్ టైమ్’ పేరిట కాలానికి సంబంధించిన రహస్యాలను పుస్తకం రూపంలో తీసుకొచ్చారు. ప్రపంచ వ్యాప్తంగా పది మిలియన్లకుపైగా కాపీలు అమ్ముడయిన ఈ పుస్తకం గిన్నిస్ బుక్‌లో చోటు దక్కించుకుంది. ‘కాలం కథ’ పేరుతో ఈ తెలుగులోకి అనువదించారు.

గ్రహాంతరవాసుల గురించి అనేక ఊహాగానాలు తలెత్తుతున్న పరిస్థితుల్లో.. వేరే గ్రహాలపై జీవులు ఉన్నాయని హాకింగ్ తెలిపారు. బిగ్ బ్యాంగ్ థియరీ ద్వారా విశ్వం పుట్టకకు సంబంధించిన రహస్యాలను ఆయన చేధించారు.

తరవాత కథనం

Telugu News App: ఏపీ, తెలంగాణకు సంబంధించిన లేటెస్ట్ అప్‌డేట్స్‌, జాతీయ, అంతర్జాతీయ, ఎడ్యుకేషన్, బిజినెస్, సినిమా, ఆధ్యాత్మికం, స్పోర్ట్స్, వైరల్ కథనాల కోసం తెలుగు సమయం యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి.
తాజా వార్తల అప్డేట్ల కోసం Samayam Telugu ఫేస్‌బుక్పేజీను లైక్ చెయ్యండి.