యాప్నగరం

వీడియో: డిక్కీలో మహిళ.. కిడ్నాప్ విఫలం!

గుర్తు తెలియని దుండగుడు ఓ మహిళను కిడ్నాప్ చేశాడు. కాళ్లు, చేతులు కట్టేసి కారు డిక్కీలో బందించాడు.

TNN 9 Nov 2017, 6:56 pm
గుర్తు తెలియని దుండగుడు ఓ మహిళను కిడ్నాప్ చేశాడు. కాళ్లు, చేతులు కట్టేసి కారు డిక్కీలో బందించాడు. కారులో ఇంధనం తక్కువగా ఉండటంతో దుండగుడు గ్యాస్ స్టేషన్‌లో కారు ఆపి, అక్కడే ఉన్న షాపింగ్ మాల్‌లోకి వెళ్లాడు. దీంతో, డిక్కీలో ఉన్న ఆ మహిళ.. ఎంతో కష్టపడి కట్లు తొలగించుకుని డిక్కీ నుంచి బయటపడింది. ఆ దృశ్యాలన్నీ అక్కడి గ్యాస్ స్టేషన్, షాపింగ్ మాల్‌లో ఉన్న సీసీటీవీ కెమేరాల్లో రికార్డయ్యాయి. ‘అలబామా న్యూస్ నెట్‌వర్క్’ కథనం ప్రకారం.. ఆ వీడియోల ఆధారంగా పోలీసులు దుండగుడిని అరెస్టు చేశారు.
Samayam Telugu abducted woman flees from the trunk of a car
వీడియో: డిక్కీలో మహిళ.. కిడ్నాప్ విఫలం!


ఈ ఘటన అల్బామాలోని చిల్టాన్‌లో చోటు చేసుకుంది. అక్టోబరు 30న అవుటాగోలో నివసిస్తున్న బాధితురాలి ఇంట్లోకి ప్రవేశించిన దుండగుడు.. ఆమెను డబ్బులు డిమాండు చేశాడు. ఆమె అందుకు నిరాకరించడంతో కాళ్లు చేతులు కట్టి, కారు డిక్కీలో వేసి తీసుకెళ్తుండుగా, ఇలా దొరికిపోయాడు. ఆమె డిక్కీ నుంచి షాపింగ్ కాంప్లెక్సులోకి పరుగులు తీస్తున్న దృశ్యాలను ఈ ట్విట్టర్ వీడియోలో చూడవచ్చు. #CAPTURED: Kidnapping suspect, Timothy Wyatt, is now in police custody. https://t.co/gP95Qvi58z pic.twitter.com/UGDpgJdfrV — Alabama News Network (@ALNewsNetwork) November 1, 2017

తరవాత కథనం

Telugu News App: ఏపీ, తెలంగాణకు సంబంధించిన లేటెస్ట్ అప్‌డేట్స్‌, జాతీయ, అంతర్జాతీయ, ఎడ్యుకేషన్, బిజినెస్, సినిమా, ఆధ్యాత్మికం, స్పోర్ట్స్, వైరల్ కథనాల కోసం తెలుగు సమయం యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి.
తాజా వార్తల అప్డేట్ల కోసం Samayam Telugu ఫేస్‌బుక్పేజీను లైక్ చెయ్యండి.