యాప్నగరం

ఇజ్రాయెల్ ప్రధాని సహాయకురాలికి కరోనా పాజిటివ్

కరోనా వైరస్ సామాన్యుల నుంచి ప్రపంచ దేశాల అధినేతల వరకూ అందర్నీ భయపెడుతోంది. బ్రిటన్ ప్రధాని బోరిస్ జాన్సన్ కోవిడ్ బారిన పడగా.. తాజాగా ఇజ్రాయెల్ ప్రధాని సహయకురాలికి కూడా కరోనా పాజిటివ్ అని తేలింది.

Samayam Telugu 30 Mar 2020, 4:31 pm
కరోనా వైరస్ సామాన్య ప్రజలనే కాదు దేశాల అధినేతలను సైతం వణికిస్తోంది. బ్రిటన్ ప్రధాని బోరిస్ జాన్సన్ కోవిడ్ బారిన పడగా.. ఆరోగ్య శాఖ మంత్రి కరోనా బారిన పడగా.. కెనడా ప్రధాని భార్య ఇటీవల కోవిడ్ నుంచి కోలుకున్నారు. తాజాగా ఇజ్రాయెల్ ప్రధాని బెంజమిన్ నెతన్యాహూ సలహాదారు రివ్కా పాలౌచ్‌‌కు కూడా కరోనా పాజిటివ్ అని తేలింది. ఈ విషయాన్ని ఇజ్రాయెల్ స్థానిక మీడియా వెల్లడించింది. గత కొద్ది రోజులుగా పాలౌచ్ ప్రధానితోపాటు ఇజ్రాయెల్ పార్లమెంట్ సభ్యులు, సలహాదారులతో సమయం గడిపాడని మీడియా తెలిపింది.
Samayam Telugu benjamin-netanyahu


పాలౌచ్‌ భర్త ముందుగా కోవిడ్ బారిన పడగా.. ఆయన నుంచి ఆమె ఇన్ఫెక్షన్ బారిన పడ్డారు. పాలౌచ్‌‌కు పాజిటివ్ అని తేలిన తర్వాత నెతన్యాహూ రెండోసారి కరోనావైరస్ పరీక్షలు చేయించుకోనున్నారు. నెతన్యాహూ‌ను క్వారంటైన్లో ఉంచాల్సిన అవసరం లేదని ప్రధాని కార్యాలయం తెలిపింది.

ఇప్పటి వరకూ ఇజ్రాయెల్‌లో 4300 మంది కరోనా బారిన పడగా 16 మంది ప్రాణాలు కోల్పోయారు. కరోనా బారిన పడిన వారిలో 80 మంది పరిస్థితి విషమంగా ఉందని ఆరోగ్య శాఖ ప్రకటించింది. 139 మంది కోలుకున్నారని తెలిపింది. కరోనాను కట్టడి చేయడం కోసం ఇజ్రాయెల్ వ్యాప్తంగా స్కూళ్లను మూసివేశారు. పది మంది కంటే ఎక్కువ మంది గుమికూడటంపై నిషేధం విధించారు.

తరవాత కథనం

Telugu News App: ఏపీ, తెలంగాణకు సంబంధించిన లేటెస్ట్ అప్‌డేట్స్‌, జాతీయ, అంతర్జాతీయ, ఎడ్యుకేషన్, బిజినెస్, సినిమా, ఆధ్యాత్మికం, స్పోర్ట్స్, వైరల్ కథనాల కోసం తెలుగు సమయం యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి.
తాజా వార్తల అప్డేట్ల కోసం Samayam Telugu ఫేస్‌బుక్పేజీను లైక్ చెయ్యండి.