యాప్నగరం

‘మసీదులపై జాతీయ జెండాలు ఎగరేయండి’

మసీదులపై జాతీయ జెండాలు ఎగరేయండి. రాజ్యాంగాన్ని అధ్యయనం చేయండి, చట్టాల గురించి ముస్లింలకు అవగాహన కల్పించండని చైనా ఇస్లామిక్ అసోసియేషన్ కోరింది.

Samayam Telugu 22 May 2018, 5:29 pm
Samayam Telugu mosques
దేశభక్తిని పెంపొందించడం కోసం చైనాలోని మసీదులపై జాతీయ జెండాను ఎగరేయాలని చైనా ఇస్లామిక్ అసోసియేషన్ ముస్లింలను కోరింది. జెండాను ఎగరేశామంటే ఎగరేశామని కాకుండా.. సరైన స్థలంలో జాతీయ జెండాను ఉంచాలని సూచించింది. రాజ్యాంగాన్ని అధ్యయనం చేయాలని కూడా అసోషియేషన్లు, మసీదులకు సలహా ఇచ్చింది. సామ్యవాద విలువలు, సంప్రదాయ చైనీస్ సంస్కృతిని తెలుసుకోవాలని చైనా ఇస్లామిక్ అసోషియేషన్ కోరింది.

చట్టాల గురించి అవగాహన కల్పించేలా ముస్లింలకు శిక్షణ తరగతులు నిర్వహించాలని కూడా సూచించింది. ఇలా చేయడం వల్ల చట్టానికి అనుగుణంగా మత కార్యకాలపాలు నిర్వహించుకుంటారని ఇస్లామిక్ అసోషియేషన్ అభిప్రాయపడింది.

చైనాలో దాదాపు 2 కోట్ల మంది ముస్లింలు ఉంటున్నారు. జిన్‌జియాంగ్ ప్రావిన్స్‌లో ఎక్కువ మంది ముస్లింలు నివసిస్తున్నారు. ఇక్కడ కోటి మందికిపైగా ఉయ్‌గర్ ముస్లింలు ఉంటుండగా. నిన్‌గ్జియా‌లో హుయ్ ముస్లింలు ఉంటున్నారు. గత కొన్నేళ్లుగా ఇతర వలసల విషయంలో ప్రావిన్స్‌ల్లో హింసాత్మక ఘటనలు చోటు చేసుకుంటున్నాయి.

మసీదులపై జాతీయజెండా ఎగరేయాలన్న నిర్ణయాన్ని కొందరు తప్పు బడుతుండగా.. జాతీయ జెండా అనేది రాజకీయాంశం కాదు. ఇది దేశానికి సంబంధించింది. కాబట్టి మత స్వేచ్ఛను ఉల్లంఘించడం కాదని నిపుణులు చెబుతున్నారు.

తరవాత కథనం

Telugu News App: ఏపీ, తెలంగాణకు సంబంధించిన లేటెస్ట్ అప్‌డేట్స్‌, జాతీయ, అంతర్జాతీయ, ఎడ్యుకేషన్, బిజినెస్, సినిమా, ఆధ్యాత్మికం, స్పోర్ట్స్, వైరల్ కథనాల కోసం తెలుగు సమయం యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి.
తాజా వార్తల అప్డేట్ల కోసం Samayam Telugu ఫేస్‌బుక్పేజీను లైక్ చెయ్యండి.