యాప్నగరం

నదిలో కూలిన హెలికాప్టర్.. అదే సమయానికి పడవ రావడంతో

టేకాఫ్ తీసుకున్న కొద్ది సేపటికే ఓ హెలికాప్టర్ గింగిరాలు తిరుగుతూ నదిలో కూలిపోయింది. అమెరికాలోని న్యూ యార్క్‌లో ఈ ఘటన చోటుచేసుకుంది. అదే సమయానికి పడవ రావడంతో ప్రమాదం తప్పింది.

Samayam Telugu 16 May 2019, 11:19 pm
టేకాఫ్‌ తీసుకున్న కొద్ది సమయానికే ఓ హెలికాప్టర్‌ ఆకాశంలో గింగిరాలు కొడుతూ నదిలో కుప్పకూలిపోయింది. అదే సమయంలో నదిలో పడవలో ప్రయాణిస్తున్న కొంత మంది సాయం అందించడంతో హెలికాప్టర్‌లో చిక్కుకున్న వారికి ప్రాణాపాయం తప్పింది. ఈ ఘటన అమెరికాలోని న్యూయార్క్‌లో బుధవారం (మే 15) చోటుచేసుకుంది. హెలికాప్టర్ నదిలో కూలుతున్న దృశ్యాలకు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.
Samayam Telugu helicopter


మాన్‌హట్టన్‌ నుంచి టేకాఫ్‌ తీసుకున్న ఓ హెలికాప్టర్‌ కాసేపటికే హడ్సన్ నది మీదుగా ఎగురుతూ అదుపు తప్పింది. అనంతరం గింగిరాలు తిరుగుతూ ఆ నదిలో కూలిపోయింది. నదిలో పడవలో ప్రయాణిస్తున్న కొంత మంది హెలికాప్టర్‌లో చిక్కుకున్న వారిని రక్షించారు. పోలీసులకు సమాచారం అందించారు.

హుటాహుటిన సంఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు, అగ్నిమాపక సిబ్బంది సహాయ కార్యక్రమాలు చేపట్టారు. ఈ ప్రమాదంలో ప్రాణనష్టం ఏమీ సంభవించలేదని, పైలట్‌‌తో పాటు మరొకరికి స్వల్ప గాయాలయ్యాయని పోలీసులు తెలిపారు. గతంలో ఒకసారి ఇదే హడ్సన్‌ నదిలో ఎయిర్‌బస్‌ ఏ320 విమానం 155 మంది ప్రయాణికులతో సురక్షితంగా దిగడం విశేషం.

అధికారులు వెంటనే స్పందించి ప్రమాదంలో ఉన్నవారిని కాపాడిన తీరు అద్భుతమని న్యూయార్క్‌ మేయర్‌ బిల్‌ దే బ్లాసియో ప్రశంసించారు. ట్విటర్‌ ద్వారా వారికి కృతజ్ఞతలు తెలిపారు.

తరవాత కథనం

Telugu News App: ఏపీ, తెలంగాణకు సంబంధించిన లేటెస్ట్ అప్‌డేట్స్‌, జాతీయ, అంతర్జాతీయ, ఎడ్యుకేషన్, బిజినెస్, సినిమా, ఆధ్యాత్మికం, స్పోర్ట్స్, వైరల్ కథనాల కోసం తెలుగు సమయం యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి.
తాజా వార్తల అప్డేట్ల కోసం Samayam Telugu ఫేస్‌బుక్పేజీను లైక్ చెయ్యండి.